AP Assembly: 11 మంది టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసిన స్పీకర్..!
- By HashtagU Desk Published Date - 12:46 PM, Tue - 15 March 22

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జంగారెడ్డి గూడెం మరణాలకు సంబంధించి అంశంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు రెండో రోజూ అసెంబ్లీలో ఆందోళనలను కొనసాగించారు. ఈ క్రమంలో సభా కార్యక్రమాలకు భంగం కల్గిస్తున్నారని స్పీకర్ పదే పదే హెచ్చరించినా, వినకపోవడంతో 11 మంది టీడీపీ సభ్యుల్ని స్పీకర్ తమ్మినేని సీతారాం ఒకరోజు సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ తీర్మానాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశ పెట్టారు.
జంగారెడ్డిగూడెం ఘటనపై నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం, సభ జరగకుండా అడ్డుకోవడంతో.. టీడీపీ సభ్యులు చినరాజప్ప, రామకృష్ణబాబు, గద్దె రామ్మోహన్, భవానీ, బెందాళం అశోక్, గణేష్ కుమార్, జోగేశ్వరరావు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్ లను సస్పెండ్ చేశారు. ఈ సందర్భంగా సభకు పదే పదే అడ్డుతగులుతుండటంతో సస్పెండ్ చేసినట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.