AP SI Jobs: ఏపీ ఎస్సై ఉద్యోగాల రాత పరీక్ష ఫలితాలు విడుదల!
ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
- By Balu J Published Date - 01:55 PM, Tue - 28 February 23

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. 411 పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు లక్షా 51 వేల 288 మంది అభ్యర్థులు హాజరుకాగా.. వారిలో 57 వేల 923 మంది అర్హత సాధించారు. అభ్యర్థుల నుంచి 15 వందల 53 అభ్యంతరాలను స్వీకరించినట్లు రిక్రూట్‌మెంట్‌బోర్డు తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది.
Also Read: NTR’s Coin: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం ఇదే!