HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >This Is The One Hundred Rupee Coin Released With Ntrs Figure

NTR’s Coin: ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం ఇదే!

ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు.. తెలుగుజాతి ఔన్నత్యానికీ, తెలుగు వాడి ఆత్మగౌరవానికీ ప్రతీకలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

  • Author : Balu J Date : 28-02-2023 - 1:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ntr Coin
Ntr Coin

నందమూరి తారకరామారావు బొమ్మతో వందరూపాయల వెండి నాణెం ఈ రోజు విడుదలైంది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన బొమ్మతో కేంద్రం వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం విశేషం.సినీ, రాజకీయ రంగాలలో ఎన్నటికీ చెరగని ముద్ర వేసిన శకపురుషుడు ఆయన. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు.. తెలుగుజాతి ఔన్నత్యానికీ, తెలుగు వాడి ఆత్మగౌరవానికీ ప్రతీకలుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకే కాదు. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం.

సినీ,రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు. ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహా నటుడు ఎన్టీఆర్ రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి..ఇలా ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్. దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.రాముడు ఎలా ఉంటాడాంటే, ఆ నాటి నుంచి ఈనాటి వరకు ఏతరం వారిని అడిగినా ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు.

కృష్ణుడు,వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్ లాగానే ఉంటారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు,భారతీయ సినిమాకు ఆయన చిరునామా…అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ సాధ్యం కాని విధంగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం అని ప్రకటించి,పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే,ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆతొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించి విజయం సాధించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారథ్యంలో విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది. అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • ap tdp
  • coin
  • ntr
  • released

Related News

INS Mahendragiri joins the Indian Navy.

INS Mahendragiri: భారత నౌకాదళంలో చేరిన ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో యుద్ధనౌకను ప్రారంభించారు. ప్రాజెక్ట్ 17A నీలగిరి-క్లాస్ ప్రోగ్రామ్ కింద ఆరవ నౌక అయిన, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ మహేంద్రగిరిని ప్రారంభించడంతో భారత నౌకాదళం శనివారం తన నౌకాదళాన్ని బలోపేతం చేసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నం డాక్‌యార్డ్‌లో ఈ యుద్ధనౌకను ప్రారంభించారు

  • State-of-the-art showroom 'Elite Eco Energy' inaugurated in Bhimavaram.

    Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Complaint filed against actor Prakash Raj at the police station.

    Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd