Shreyas Media: శ్రేయాస్ మీడియాకు మహా కుంభ మేళా ప్రకటనల హక్కులు
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా సోమవారం ప్రకటించింది.
- By Gopichand Published Date - 11:36 PM, Sun - 29 December 24

Shreyas Media: శ్రేయాస్ మీడియా.. అంటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రెస్ మీట్‌లు, సక్సెస్ మీట్‌లు గుర్తుకువస్తాయి. అయితే శ్రేయస్ మీడియా (Shreyas Media)కు ఇప్పుడు బంపరాఫర్ వచ్చింది. అడ్వర్టైజింగ్‌లోనూ తనదైన ముద్ర వేస్తోన్న శ్రేయాస్ మీడియాకు కుంభ మేళా ప్రకటన హక్కులు దక్కాయి.
జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరగనున్న మహా కుంభమేళా 2025 కోసం ప్రత్యేక ప్రకటన హక్కులను పొందినట్లు ఆదిశ్రీ ఇన్ఫోటైన్‌మెంట్ విభాగం శ్రేయాస్ మీడియా ప్రకటించింది. హైదరాబాద్ నగరానికి చెందిన సంస్థ నుండి ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. ఈవెంట్‌లో భాగంగా వెండింగ్ జోన్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌లు.. ఫుడ్ కోర్ట్‌లతో సహా అనేక ఇతర కార్యకలాపాలను నిర్వహించడానికి హక్కులు కూడా శ్రేయాస్ మీడియాకు దక్కాయి.
Also Read: Game Changer Story: గేమ్ ఛేంజర్ స్టోరీ ఇదే.. డైరెక్టర్ శంకర్!
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనంలో విస్తారమైన వినియోగ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ కంపెనీలు 45 రోజుల మహా కుంభ్ సందర్భంగా బ్రాండింగ్ మరియు మార్కెటింగ్‌లో రూ. 3,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని ఆ ప్రకటన తెలిపింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 2025లో మహా కుంభమేళాను నిర్వహిస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా భక్తులను ఆకర్షిస్తుంది. 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ సంవత్సరం ఈవెంట్ చరిత్రలో అతిపెద్ద కుంభమేళాగా పరిగణించబడుతుంది.
ఈవెంట్ అంతటా వ్యూహాత్మకంగా ఉంచిన హోర్డింగ్‌లు, గ్యాంట్రీ బాక్స్‌లు, వాచ్/మీడియా టవర్‌లు, కరెంట్ పోల్స్, ఛార్జింగ్ స్టేషన్‌లు, స్కై బెలూన్‌లతో అధిక-ప్రభావ ప్రకటన అవకాశాలను సృష్టించాలని శ్రేయాస్ మీడియా యోచిస్తోంది. శ్రేయాస్ మీడియా వ్యవస్థాపకుడు, చైర్మన్ జి.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. మహా కుంభ మేళా వేదికగా బ్రాండ్లను కోట్లాది మందికి చేర్చడానికి తమకు ఉన్న అనుభవం, నైపుణ్యాలను ఉపయోగిస్తామని అన్నారు. బ్రాండ్‌లను జనాలతో కనెక్ట్ చేసేందుకుఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని ఆయన తెలిపారు.