Road Accident : హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు మృతి...
- By Prasad Published Date - 12:07 PM, Tue - 25 October 22

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వాహనదారుడు మృతి చెందాడు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నంబర్ 280 సమీపంలో మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఆరీఫ్ అనే వ్యక్తిని ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఆ తరువాత ఆరీఫ్ రోడ్డుపై పడి ట్రక్కు ముందు చక్రం కిందకు వచ్చి అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.