Muchintal: రామానుజచార్య సహస్రాబ్ది సమారోహ అంకురార్పణ
- By Balu J Published Date - 06:55 PM, Wed - 2 February 22

శంషాబాద్ లో ముచ్చింతల్ గ్రామంలో రామానుజాచార్య కార్యక్రమాలు అట్టహసంగా మొదలైన సంగతి తెలిసిందే. ఉత్సవాల్లో భాగంగా నేడు హైదరాబాద్ నగర శివారు ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రంలో రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా జీయర్ ఆస్పత్రి ప్రాంగణం నుంచి యాగశాల వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ శోభాయాత్రలో త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామితో పాటు పలువురు స్వామీజీలు, వేలాది మంది వాలంటీర్లు పాల్గొన్నారు.