Draupadi Murmu In AP : సీఎం జగన్‌ని కలిసిన ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి...
- By Prasad Published Date - 04:31 PM, Tue - 12 July 22

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపది ముర్ముకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, గోరంట్ల మాధవ్ స్వాగతం పలికారు. ఎంపీలు ఆమెకు గిరిజన సంప్రదాయంలో ఘనస్వాగతం పలికారు. అనంతరం ద్రౌపది ముర్ము విమానాశ్రయం నుంచి విజయవాడ రోడ్డుకు బయలుదేరారు. ద్రౌపది ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. ఏపీలో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ప్రకటించిన వెంటనే వైఎస్సార్‌సీపీ తన మద్దతును ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు.