Air India: ఎయిరిండియా విమానంలో భారీ కుదుపులు, ప్రయాణికులకు గాయాలు!
ఢిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం లో ఏదో సమస్య వల్ల కుదుపులకు గురైంది.
- By Balu J Published Date - 05:32 PM, Wed - 17 May 23

ఎయిరిండియా (Air India) విమానంలో లోపం తలెత్తడం వల్ల అందులోని ప్రయాణికులు గాయపడ్డారని అధికారులు తెలిపారు. నిన్న ఢిల్లీ నుంచి సిడ్నీకి బయలుదేరిన ఎయిరిండియా విమానం లో భారీ కుదుపులకు గురైంది. ఈ ఘటనలో ప్రయాణికులకు ఏమి కానప్పటికీ, కొందరికి గాయాలయ్యాయి. స్వల్పంగా గాయపడ్డ ప్రయాణికులకు వైద్య సహాయం (Medical Help) అందించామని అధికారులు తెలిపారు. క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులకు ప్రథమ చికిత్స ద్వారా ట్రీట్ మెంట్ చేశారు.
“16 మే 2023 నాటి ఎయిర్ ఇండియా విమానం AI302, ఢిల్లీ నుండి సిడ్నీకి నడుస్తోంది. ఆకాశంలో దూసుకుపోతున్న విమానంలో ఒక్కసారిగా కుదుపులకు గురైంది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. అయినప్పటికీ విమానం సురక్షితంగా సిడ్నీలో (Sidney) ల్యాండ్ అయింది. ముగ్గురికి ప్రయాణికులకు వైద్యం అందించాం” అని ఒక ప్రతినిధి తెలిపారు.
Also Read: Keerthy Suresh BF: అతడే కీర్తి భాయ్ ఫ్రెండ్.. దసరా బ్యూటీ రియాక్షన్ ఇదే!