Speed News
-
CM KCR: రేపు వరంగల్ జిల్లాలో కేసీఆర్ పర్యటన
హైదరాబాద్ ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరుగుతోంది. ఈ భేటీలో పలు కీలక విషయాలను చర్చించారు. ముఖ్యంగా అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు (మంగళవారం) సీఎం శ్రీ కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, చీఫ్ సెక్రెటరీ, ఇతర ఉన్న
Published Date - 05:54 PM, Mon - 17 January 22 -
ED Case: స్కిల్ ఇన్ ఫ్రా చైర్మన్ రూ. 30కోట్ల వ్రజాలు సీజ్
స్కిల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నిఖిల్ గాంధీకి చెందిన లాకర్ల సోదాల్లో దాదాపు రూ.30 కోట్ల విలువైన వజ్రాలు సహా ఆభరణాలను కనుగొన్నారు.
Published Date - 04:05 PM, Mon - 17 January 22 -
AP CM: ఆ ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టి
రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో మిగతా జిల్లాలతో పోలిస్తే కాస్త దిగువన ఉన్న ఐదు జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. తూర్పుగోదావరి, గుంటూరు, వైయస్సార్‌కడప, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రెండో డోస్‌పైన ప్రత్యేక దృష్టిపెట్టాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. 15 నుంచి 18 ఏళ్లవారికీ 100శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తిచేసిన నెల్లూరు, ప.గో. జిల్లాలు కాగా, మరో 5
Published Date - 03:53 PM, Mon - 17 January 22 -
Moon: చైనా ‘కృత్రిమ చంద్రుడి’ సృష్టి
చంద్రమండలంపై ఆధిపత్యాన్ని కొనసాగిస్తోన్న చైనా తాజాగా కృత్రిమ చంద్రుడు ను అభివృద్ధి చేయడానికి సిద్ధం అవుతోంది
Published Date - 03:51 PM, Mon - 17 January 22 -
Harish Rao: కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధం!
తెలంగాణలో విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరి
Published Date - 03:34 PM, Mon - 17 January 22 -
Nara Lokesh: నారా లోకేశ్ కు కరోనా పాజిటివ్!
ఏపీలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రతిరోజు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు కొవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘‘నాకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఎలాంటి లక్షణాలు లేవు. కానీ కొవిడ్ బారిన పడ్డాను. డాక్టర్ల సూచ
Published Date - 02:30 PM, Mon - 17 January 22 -
Nara Lokesh: విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ లోకేశ్ లేఖ!
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల సెలవులు పొడిగించాలని కోరుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddyకి లేఖ రాశారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాయని, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు రెండు వారాల పాటు స్కూల్స్ కి సెలవులు ప్రకటించాయని లేఖ లో గుర్తు చేశారు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా వ్యాక్సిన్ అ
Published Date - 12:54 PM, Mon - 17 January 22 -
Andhra Family Treats: 365 రకాల వంటలు.. అల్లుళ్లకు ‘సంక్రాంతి’ విందు!
సంక్రాంతి అంటే పాడిపంటలు, పిండి వంటలు, కోళ్ల పందెలు మాత్రమే కాదు.. అల్లుళ్ల సందడి కూడా. సంక్రాంతి పండుగకు కచ్చితంగా అల్లుళ్లను పిలిచి ఎన్నో మర్యాదలు చేస్తుంటారు.
Published Date - 12:40 PM, Mon - 17 January 22 -
Covid updates: దేశంలో ‘పాజిటివిటీ’ పెరుగుతోంది!
భారత్‌లో కొవిడ్ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో 1,51,740 మంది కొవిడ్ నుంచి కోలుకొన్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,53,37,461కు చేరింది. దీంతో భారత్‌లో రికవరీలు 94.27శాతంగా ఉ
Published Date - 12:19 PM, Mon - 17 January 22 -
Night Curfew: జనవరి 18 నుంచి ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ!
కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో జనవరి 18 నుంచి రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించనున్నారు.
Published Date - 09:57 AM, Mon - 17 January 22 -
Modi: దావోస్ సదస్సులో నేడు మోడీ ప్రసంగం
సోమవారం జరగనున్న ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఇఎఫ్) దావోస్ ఎజెండా వర్చువల్ సదస్సులో ప్రధాని మోడీ ప్రసంగించనున్నారు.
Published Date - 09:54 AM, Mon - 17 January 22 -
Birju Maharaj: లెజెండరీ కథక్ డ్యాన్సర్ పండిట్ బిర్జూ మహారాజ్ కన్నుమూత
ప్రముఖ కథక్ నాట్యాచార్యులు, పద్మ విభూషణ్ గ్రహీత పండిట్ బిర్జు మహారాజ్ (83) తుది శ్వాస విడిచారు. గుండెపోటుతో ఆయన నివాసంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు.
Published Date - 09:28 AM, Mon - 17 January 22 -
CM KCR: పరిపాలనా సంస్కరణలకు కేసీఆర్ కమిటీ
వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీతో పాటు అమలులో అన్ని స్థాయిల్లోని ఉద్యోగుల చురుకైన భాగస్వామ్యంపై అధ్యయనం చేసి సలహాలిచ్చేందుకు నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
Published Date - 09:14 PM, Sun - 16 January 22 -
Rowdy Boys:రౌడీ బాయ్స్ సినిమా ఫాన్స్ కి బైక్ గిఫ్ట్
రౌడీ బాయ్స్ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దింతో ఆ సినిమా యూనిట్ ఫుల్ జోష్ లో ఉంది. సినిమా సక్సెస్ ను పంచుకోవడానికి సినిమా థియేటర్స్ వెళ్లి ఫాన్స్ తో సందడి చేస్తున్నారు.
Published Date - 07:30 PM, Sun - 16 January 22 -
Telangana BJP: టీ బీజేపీ మెరుపు ఆపరేషన్ షురూ!
తెలంగాణ బీజేపీ రాజకీయ మెరుపు ఆపరేషన్స్ కు బ్లూ ప్రింట్ సిద్ధం చేసింది. ఇతర పార్టీ ల నుంచి లీడర్స్ ను తీసుకోవడానికి ఇంద్రసేనారెడ్డి చైర్మన్ గా జాయినింగ్స్ అండ్ కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసింది.
Published Date - 07:14 PM, Sun - 16 January 22 -
Djokovic Loses: జకోవిచ్ కు ఫెడరల్ కోర్టు షాక్
వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్ నోవాక్ జకోవిచ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచి అత్యధిక గ్రాండ్ స్లామ్‌లు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాలని అతని ఆశలకు తెరపడింది. తన వీసా రద్దును వ్యతిరేకిస్తూ వేసిన పిటీషన్ లో జకోవిచ్ కు చుక్కెదురైంది.
Published Date - 06:46 PM, Sun - 16 January 22 -
AP Schools:పాఠశాలలు యథావిధిగా: ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
సంక్రాంతి సెలవులను పొడిగించే ఆలోచన లేదని ప్రకటించిన నేపథ్యంలో పాఠశాలలు యథావిధిగా నడుస్తాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
Published Date - 06:40 PM, Sun - 16 January 22 -
Speaker Positive :స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చిన్నపాటి లక్షణాలు కనిపించడంతో.. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్ష అంటూ ప్రచారం జరుగుతోంది.
Published Date - 12:46 PM, Sun - 16 January 22 -
Fire:వినాయకుడి గుడి సమీపంలో మంటలు చెలరేగాయి
విజయవాడ కనకదుర్గమ్మ గుడి సమీపంలోని వినాయకుడి గుడి సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.
Published Date - 12:29 PM, Sun - 16 January 22 -
Lockdown: తమిళనాడులో ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్
తమిళనాడు రాష్ట్రంలో కొనసాగుతున్న కోవిడ్-19 ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి ఆదివారం పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను ప్రకటించింది.
Published Date - 12:23 PM, Sun - 16 January 22