Night Curfew: ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగింపు
కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
- By Hashtag U Published Date - 10:33 PM, Tue - 1 February 22

అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ.. ఈ మేరకు ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఏపీలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. జనవరి 18 నుంచి 31వ తేదీ వరకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నిన్నటితో గడువు ముగియనున్న నేపథ్యంలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 14 వరకు రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.