TDP: చేతకాని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని గద్దె దించుతాం!
టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష జరిగింది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.
- By Hashtag U Published Date - 10:17 PM, Mon - 31 January 22

టీడీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నారీ సంకల్ప దీక్ష జరిగింది. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మహిళలు హాజరైయ్యారు. చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ది, సంక్షేమం చూశాం, కానీ నేడు వైసీపీ పాలనలో అభివృద్ది, సంక్షేమం అనేది లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ఎటు చూసినా మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు, ఆత్యహత్యలు, అత్యాచారాలు, క్యాసినోలు, బెల్లీ డాన్సులు, వ్యభిచారాలు జరుగుతున్నాయని…జగన్ రెడ్డి లాంటి చేతకాని వ్యక్తి ముఖ్యమంత్రి కావటం మన దురదృష్టమన్నారు. జగన్ రెడ్డిని ఏ చేతే ఓట్లేసి అధికారంలోకి కూర్చోబెట్టామో అదే చేత్తో మీట నొక్కి గద్దె దింపాలని మహిళలను కోరారు.రూ. 2 వేల కోట్లు పొదుపు మహిళల సొమ్ము కాజేసిన వ్యక్తిని దొంగోడు అనాలా, బూచోడు అనాలా, దుర్మార్గుడు అనాలా? అని ఆమె ప్రశ్నించారు. నిత్యవసర ధరలు పెంచి పప్పు అన్నం తినే వారిని గంజి త్రాగే స్థితికి తెచ్చిన వ్యక్తి సీఎం జగన్ అని.. సంక్షేమ పధకాల పేరుతో రూ. 10 చేతిలో పెట్టి రూ. 90 రూపాయలు లాక్కుంటున్నారని ఆమె ఆరోపించారు.
మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని 21 రోజుల్లో దిశ చట్టం కింద ఉరితీస్తామని చెప్పారు? ఆ చట్టం ఏమైంది? దిశ చట్టానికి చట్టబద్దత లేక చెత్తకుప్పల్లోకి వెళ్లిందా? అని ప్రశ్నించారు. విజయవాడలో బాలిక ఆత్మహత్య ఘటన బాధాకరమని… కానీ దానికి రాజకీయ రంగు పులిముతున్నారని ఆమె అన్నారు. వినోద్ చంద్రబాబు తో ఉన్న పోటో సాక్షిలో వేశారని..అతను వెల్లంపల్లి, అమిత్ షా, నిర్మలా సీతారామన్ తో ఉన్న పోటోలు కూడా ఉన్నాయని వాటిని ప్రచురించే దమ్ము సాక్షికి ఉందా? అని ప్రశ్నించారు. వినోద్ జైన్ ని ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నామని.. అంబటి రాంబాబును, అవంతి వ్రీనివాస్ ని ఉరి తీసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. బిటిక్ విద్యార్దిని రమ్యను నడిరోడ్డుపై చంపినపుడు వైసీపీ నేతలు ఎందుకు కొవ్వొత్తుల ర్యాలీ చేయలేదో చెప్పాలని.. రూ. 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు. మద్యపాన నిషేదంపై ఎందుకు మాట తప్పారు? వాసిరెడ్డి పద్మ, రోజా ఎందుకు మద్యపాన నిషేదంపై మాట్లాడంలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ మహిళకు అన్యాయం జరిగినా…. జగన్ ఇంటి వద్ద దీక్ష చేస్తామని..వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అన్యాయాలు పై తెలుగు మహిళల తరపున రాజీలేని పోరాటం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. బాదితులకు న్యాయం చేసే వరకు, దద్దమ్మ ముఖ్యమంత్రి గద్దె దించేవరకు పోరాడుతామన్నారు.