RRR: ఆర్ఆర్ఆర్ మార్చి 25న రాబోతోంది!
Jr NTR, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న
- Author : Balu J
Date : 31-01-2022 - 7:55 IST
Published By : Hashtagu Telugu Desk
Jr NTR, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ 2022లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. కోవిడ్-19 కారణంగా ఈ చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాతలు. ఇప్పుడు, చివరి విడుదల తేదీ మార్చి 25 అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. జనవరి 1న, సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు RRR మేకర్స్ ప్రకటించారు. రెండు వాయిదాల తర్వాత RRR మార్చి 25 న బహుళ భాషలలో సినిమాల్లోకి రానుంది. ఈ మేరకు జనవరి 31న ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేయబడింది. “#RRRonMarch25, 2022.. ఖరారు చేయబడింది!
#RRRonMarch25th, 2022… FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS
— RRR Movie (@RRRMovie) January 31, 2022