HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Nirmal Mission Bhagiratha Monkey Carcass Water Tank

Monkey Carcass : మారని అధికారుల తీరు.. మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం

Monkey Carcass : నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.

  • Author : Kavya Krishna Date : 11-10-2024 - 11:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Monkey Carcass
Monkey Carcass

Monkey Carcass : నిర్మల్ జిల్లాలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులో కోతి కళేబరం బయటపడటం స్థానికంగా సంచలనం సృష్టించింది. కుబీర్ మండలంలోని నిగ్వ గ్రామంలో ఉన్న మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌లో వారం రోజులుగా నీరు వినియోగిస్తున్న గ్రామస్తులు దుర్వాసన వస్తోందని గమనించి, అనుమానంతో ట్యాంకును పరిశీలించగా, అందులో కోతి కళేబరం కనిపించింది. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చి, కోతి శవాన్ని తొలగించి, ట్యాంక్‌ను శుభ్రం చేశారు.

కానీ, వారం రోజులుగా అదే నీటిని తాగిన గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. కలుషిత నీరు తాగడం వల్ల ఎలాంటి రోగాలు వస్తాయోనన్న ఆందోళన లో ఉన్నారు. దీనికి కారణమైన అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటి నిర్వహణ పట్ల స్థానిక ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. అధికారులకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Weather Alert : పండగ వేళ.. తెలుగు రాష్ట్రాలకు వర్షాలకు భారీ వర్ష సూచన

కోతులు నీటి కోసం ప్రయత్నిస్తూనే లేదా పరస్పరం కీచులాడుకునే సందర్భంలో ఒక కోతి ట్యాంకులో పడిపోయి ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ట్యాంకుకు సరైన మూత పెట్టకపోవడం వల్ల ఈ ఘటన జరిగిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కలుషిత నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమ్యలు వస్తాయోనన్న ఆందోళనలో ప్రజలు ఉండటంతో.. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

CM Revanth Reddy : నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కి శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌ రెడ్డి

ఇది మొదటిసారి కాకుండా గతంలోనూ ఇలాంటి సంఘటనలు తెలంగాణలో చోటుచేసుకున్నాయి. నాగార్జునసాగర్‌లో, నల్లగొండ జిల్లాలో కూడా మంచినీటి ట్యాంకుల్లో కోతుల కళేబరాలు బయటపడటం విమర్శలకు దారితీసింది. అలాంటి ఘటనలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతమవ్వడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా వాటర్ ట్యాంకులను తరచుగా పరిశీలించి, శుభ్రం చేసేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • government negligence
  • mission bhagiratha
  • monkey carcass
  • Nirmal
  • Public Health
  • telangana
  • water contamination
  • water tank cleaning

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd