HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Monsoon To Hit Telangana On June 22

Monsoon Telangana : రేపు తెలంగాణలోకి నైరుతి.. ఏపీకి భారీ వర్ష సూచన

Monsoon Telangana : నైరుతి రుతుపవనాలపై  కొత్త అప్ డేట్ వచ్చింది..

  • Author : Pasha Date : 21-06-2023 - 7:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rain Alert
Rain Alert

Monsoon Telangana : నైరుతి రుతుపవనాలపై  కొత్త అప్ డేట్ వచ్చింది.. నైరుతి రుతుపవన మేఘాలు జూన్ 22 నాటికి తెలంగాణకు చేరుకుంటాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. జూన్ 26-27 నాటికి తెలంగాణ రాష్ట్రం అంతటా వర్షాలు విస్తరిస్తాయని అంచనా వేసింది.  ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల కదలిక తెలంగాణలోని ఉత్తర, మధ్య జిల్లాల్లో సాధారణంగా ఉంటుంది.దీనివల్ల అక్కడ సాధారణ స్థాయిలో వానలు(Monsoon Telangana) కురుస్తాయి. రాష్ట్రంలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలతో సహా దక్షిణాది జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. వచ్చే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోని  ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఆ తర్వాత నాలుగు రోజుల పాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

Also read : 41 Women Prisoners Killed : 41 మంది మహిళా ఖైదీల హత్య.. హోండురస్  జైలులో దారుణం 

దేశంలోని 16 రాష్ట్రాల్లో కూడా.. 

వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. రాబోయే 15 రోజుల్లో దేశంలోని సగం కంటే ఎక్కువ (16) రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయి. సోమవారం  నుంచే కొన్ని రాష్ట్రాల్లో వానలు మొదలయ్యాయి. ఢిల్లీ, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, రాజస్థాన్, అస్సాం, సిక్కింలలో వర్షం కురిసింది. రాబోయే 24 గంటల్లో సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. బిపర్జాయ్ తుఫాను మన దేశంలో వర్షాభావాన్ని భర్తీ చేస్తోంది. దీని ఎఫెక్ట్ తో వాయవ్య భారతదేశంలో కోటా కంటే 37% ఎక్కువ వర్షం కురిసింది. బిపర్జాయ్ వల్ల గత నాలుగు రోజుల్లో గుజరాత్, రాజస్థాన్‌లలో చాలా వర్షాలు కురిశాయి. ఫలితంగా రుతుపవనాల బలహీనత కారణంగా దేశవ్యాప్తంగా  ఏర్పడిన వర్షపాతం లోటులో 20 శాతం భర్తీ అయింది.

రుతుపవనాలు వచ్చి 19 రోజులైనా.. 

సాధారణంగా మన దేశంలో రుతుపవనాల సీజన్ జూన్ 1 నుంచి ప్రారంభమవుతుంది.  అయితే ఈసారి రుతుపవనాలు 8 రోజులు ఆలస్యంగా కేరళకు చేరాయి. దీని ప్రకారం వర్షాకాల సీజన్ ప్రారంభమై 19 రోజులు గడుస్తున్నా కురవాల్సిన స్థాయిలో వర్షాలు కురవలేదు. ఈ సీజన్‌లో దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 21%, మధ్య భారతదేశంలో 56%, దక్షిణాదిలో 61% తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తం దేశంలో సగటున 33% వర్షపాతం నమోదైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • heavy rains
  • IMD
  • June 22
  • June 26-27
  • monsoon
  • Monsoon Telangana
  • southwest monsoon
  • telangana

Related News

Promotions in the Endowments Department: EOs promoted to Grade-1.

Endowments Department: దేవాదాయ శాఖలో ప్రమోషన్లు.. ఈవోలకు గ్రేడ్‌‌-1గా ప్రమోషన్లు

తెలంగాణ దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ఎట్టకేలకు ముగింపు లభించింది. శాఖను మరింత బలోపేతం చేయడంలో భాగంగా గ్రేడ్-2 కార్యనిర్వహణ అధికారులుగా విధుల్లో ఉన్న 26 మంది అధికారులకు గ్రేడ్-1 అధికారులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, ద

  • Massive robbery at Khammam Sonovision showroom

    Khammam: ఖమ్మం సోనోవిజన్ షోరూమ్‌లో భారీ దోపిడీ

  • Heavy rain forecast for several districts in AP today.

    Rain Alert: నేడు ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

  • The chicken curry that took the life of the father

    Chicken Curry: తండ్రి ప్రాణం తీసిన నాటుకోడి కూర

  • Amit Shah makes key remarks on alliances in Telangana.

    Amit Shah: తెలంగాణలో పొత్తులపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Latest News

  • ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

  • High Court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు హైకోర్టు 50 వేల జరిమానా

  • Visakhapatnam Steel Plant: వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ అధికారులపై సీరియస్

  • Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

  • Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd