HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mlc Kavitha Fires On Cm Revanth Reddy

MLC Kavitha : సీఎం రేవంత్ బీజేపీలో చేరే అవకాశం..!

  • Author : Kavya Krishna Date : 07-03-2024 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kavitha Interim Bail
Kavitha (1)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరవు వచ్చిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకే కాళేశ్వరం నుంచి నీళ్లు ఎత్తిపోయలేదని రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సీఎం రేవంత్ డీఎన్ఏలోనే మోదీతో స్నేహం ఉందని కవిత విమర్శించారు. అంతేకాకుండా.. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలపై సీఎం రేవంత్‌ రెడ్డికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు కవిత. మహిళా రిజర్వేషన్ల అమలుపై రేపు ధర్నా చౌక వద్ద దీక్ష చేస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

లిక్కర్ కేసు…పెద్ద కేసు కాదని, నాకు కూడా పెద్ద ఇంటరెస్ట్ లేదని ఆమె అన్నారు. మా లీగల్ టీం దాన్ని చూసుకుంటుందని ఆమె వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందని కవిత అన్నారు. ఆదర్శ్ స్కామ్ లో ప్రమేయం ఉన్న చవాన్ కు రాజ్యసభ సీటు ఇచ్చారని ఆమె వెల్లడించారు. ఆయన్ను సీఎంగా చేస్తారేమో అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థతతో రాష్ట్రంలో కృత్రిమ కరువు వచ్చిందని ఆమె మండిపడ్డారు. సాగునీరు, తాగునీరు ఇవ్వలేమని సీఎం అంటున్నారని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నా దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఈ కరువు వచ్చిందని, కేసీఆర్ ను బద్నాం చేయాలని కుట్ర చేస్తున్నారని ఆమె అన్నారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన అని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. రేవంత్ పాలనలో బీసీ మేజర్ కులాలకు ప్రాధాన్యత లేదని ఆమె విమర్శించారు.

మహిళ వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ సర్కార్‌పై ముద్ర పడబోతోందని ఆమె అన్నారు. పూర్తిగా మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని, మొన్న ఇచ్చిన 30 వేల ఉద్యోగాల్లో ఎంత మంది మహిళలకు వచ్చాయని ఆమె ప్రశ్నించారు. పాత జీవోలు రద్దు చేసి, కొత్త జీవోలు ఇస్తున్నారని కవిత మండిపడ్డారు. దీక్షకు అనుమతులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడెందుకు ఇవ్వటం లేదని ఆమె ధ్వజమెత్తారు. మరో గంట వేచి చూసి కోర్టుకు వెళ్లి రేపటి ధర్నా అనుమతి తెచ్చుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ అనుమతులు ఇవ్వకపోతే కోర్టుకు అనుమతి తెచ్చుకొని బతుకమ్మలు ఆడిన చరిత్ర మాది అని కవిత గుర్తు చేశారు.

Read Also : Prashanth Neel: నన్ను ఫాలో కావద్దు, నేను చేసిన తప్పు మీరు చేయవద్దు…. కెజిఎఫ్ డైరెక్టర్ ఇలా అనేశాడేంటి?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • breaking news
  • Latest News
  • MLC Kavitha
  • telugu news

Related News

Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత పట్టున్న ఖమ్మం జిల్లా రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక సరికొత్త ముందస్తు వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని, బంధుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు, ప్రస్తుత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కుమ

  • Iran and the US sign peace agreement.

    US-Iran Peace Deal: శాంతి ఒప్పందంపై ఇరాన్, అమెరికా సంతకాలు

  • Big alert for candidates: NEET 're-exam' date fixed.

    NEET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. నీట్‌ ‘రీ–ఎగ్జామ్‌’ డేట్ ఫిక్స్

  • Good news for auto enthusiasts... ‘Jagnelis’ steel launched for automobiles!

    Automotive: వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. ఆటోమొబైల్స్ కోసం ‘జాగ్నెలిస్’ ఉక్కు ప్రారంభం!

  • Bollywood beauties to dazzle at ‘Amazon Beautyverse 2026’!

    Amazon Beautyverse 2026 : ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’లో తళుక్కుమననున్న బాలీవుడ్ భామలు!

Latest News

  • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

  • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

  • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

  • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

  • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd