Road Accident: భూపాలపల్లి జిల్లాలో లారీ బీభత్సం..వ్యక్తి మృతి
భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనానదారుడు పార్కింగ్ చేస్తుండగా లారీ డ్రైవర్ అదుపు తప్పి అతనిపైకి దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు
- By Praveen Aluthuru Published Date - 05:32 PM, Tue - 8 August 23

Road Accident: భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనానదారుడు పార్కింగ్ చేస్తుండగా లారీ డ్రైవర్ అదుపు తప్పి అతనిపైకి దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. భూపాలపల్లి పోలీసు సూపరింటెండెంట్ కరుణాకర్ జైశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని భూపాలపల్లిలో కాటారం నుంచి పర్కల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి ఆగి ఉన్న పలు వాహనాలపై ఎక్కింది. ఆ పక్కనే ద్విచక్ర వాహనానదారుడు పార్కింగ్ చేస్తుండగా లారీ అతనిపైకి దూసుకెళ్లింది. దీంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని భూపాలపల్లి ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సాయంత్రం మృతి చెందాడు. అయితే ప్రమాదం జరిగిన క్షణాల్లో లారీ డ్రైవర్ పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులపై 304ఎ, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Rahul Gandhi: నా పేరు రాహుల్.. నా ఇల్లు ఇండియా