IPL Auction 2024: ఐపీఎల్ 2024 వేలం.. తొలి సెట్ లో అమ్ముడుపోని ఆటగాళ్లు వీళ్ళే..!
ఐపీఎల్ 2024 (IPL Auction 2024) మినీ వేలం తొలి సెట్ ముగిసింది.
- Author : Gopichand
Date : 19-12-2023 - 2:09 IST
Published By : Hashtagu Telugu Desk
IPL Auction 2024: ఐపీఎల్ 2024 (IPL Auction 2024) మినీ వేలం తొలి సెట్ ముగిసింది. తొలి సెట్‌లో స్టార్ బ్యాట్స్‌మెన్‌పై వేలంపాట జరిగింది. వీరిలో రోవ్‌మన్ పావెల్ ను రాజస్థాన్ రాయల్స్ జట్టు భారీ మొత్తంలో బిడ్ వేసి కొనుగోలు చేసింది. పావెల్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.4 కోట్లకు కొనుగోలు చేసింది. కాగా ట్రావిస్ హెడ్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 6.8 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read: Rovman Powell: ఐపీఎల్ 2024 వేలం.. మొదట అమ్ముడైన ఆటగాడు ఇతనే..!
ఐపీఎల్ మినీ వేలంలో చాలామంది ఆటగాళ్లకు షాక్ తగిలింది. ఇందులో మొదటగా దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ రిలే రూసో అమ్ముడుపోలేదు. అతని బేస్ ధర రూ.2 కోట్లు. ఇతని కొనటానికి ఏ టీం ఆసక్తి చూపలేదు. ఈ లిస్టులో భారత ఆటగాడు కరుణ్ నాయర్ కూడా ఉన్నాడు. నాయర్ బేస్ ధర రూ.50 లక్షలు. మనీష్ పాండే కూడా అమ్ముడుపోలేదు. అతని బేస్ ధర రూ.50 లక్షలు. స్టీవ్ స్మిత్ ను కూడా కొనుగోలు చేయటానికి ఏ జట్టు ఇంట్రెస్ట్ చూపలేదు. డింతో తొలి సెట్ ముగిసింది. తొలి సెట్‌లో టాప్ బ్యాట్స్‌మెన్‌పై వేలంపాట జరిగింది. రెండో సెట్‌లో టాప్ ఆల్‌రౌండర్ల కోసం వేలం పాట జరుగుతోంది.
We’re now on WhatsApp. Click to Join.