PawanKalyan : తిరుపతి నుంచే జనసేనాని యాత్ర: నాదెండ్ల మనోహర్..!!
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా...రాజకీయ సమీకరణాలు రోజురోజు మారుతూనే ఉన్నాయి. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేసేందుకు ఆ పార్టీలో వ్యుహాలు రచిస్తున్నారు.
- Author : hashtagu
Date : 10-06-2022 - 9:02 IST
Published By : Hashtagu Telugu Desk
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా…రాజకీయ సమీకరణాలు రోజురోజు మారుతూనే ఉన్నాయి. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పినట్లుగానే ఆంధ్రప్రదేశ్ లో యాత్ర చేసేందుకు ఆ పార్టీలో వ్యుహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ..జనసేనాని త్వరలోనే యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ముఖ్యనేత నాదేండ్ల మనోహర్ వెల్లడించారు. అక్టోబర్ లో తిరుపతి నుంచి ఈ యాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.
కాగా వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని…ప్రణాళిక లేని పాలనతో రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం అని..సర్కార్ ను నడపడం చేతకాక చేతులు ఎత్తేశాడని తనదైన శైలిలో విమర్శించారు. అందుకే వచ్చే మార్చిలో జగన్ ఎన్నికలకు వెళ్తాడని…దీనిపై తమ దగ్గర పక్కా సమాచారం ఉందని చెప్పారు నాదేండ్ల మనోహర్. నిజాయితీకి నిదర్శనంగా ఉండే పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో భారీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.