Army Officer: ఈ డిగ్రీ ఉంటే.. మీరే ఆర్మీ ఆఫీసర్.. నెలకు రూ. 2.50 లక్షల జీతం
చాలా మంది ఔత్సాహిక యువత ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం ఉంది.
- Author : Maheswara Rao Nadella
Date : 20-04-2023 - 12:50 IST
Published By : Hashtagu Telugu Desk
Indian Army Officer : మీకు ఈ డిగ్రీ ఉంటే.. ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్ అయ్యే ఛాన్స్ లభిస్తుంది. అంతేకాదు నెలకు రూ. 2.50 లక్షల జీతం కూడా లభిస్తుంది. ఇండియన్ ఆర్మీలో (Army) ఉద్యోగం చేయాలనేది ప్రతి యువకుడి కల. చాలా మంది ఔత్సాహిక యువత ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల కోసం వేచి చూస్తుంటారు. అలాంటి వారికి ఒక గొప్ప అవకాశం ఉంది. 2024 జనవరి లో ప్రారంభమయ్యే 138వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులలో (TGC) అందుబాటులో ఉన్న 40 ఖాళీలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను ఇండియన్ ఆర్మీ విడుదల చేసింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఇండియన్ ఆర్మీ TGC 138 కోసం ఆన్‌లైన్ ఫారమ్‌ను సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 17లోగా ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ముందుగా ఈ విషయాలను జాగ్రత్తగా చదవండి.
- ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 18
- ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: మే 17
- వయోపరిమితి : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఇండియన్ ఆర్మీ భారతి అభ్యర్థులకు వయోపరిమితి 01 జనవరి 2024 నాటికి వారి కనీస వయోపరిమితి 20 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు ఉండాలి.
ఇండియన్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ (Indian Army Recruitment) సివిల్ కింద భర్తీ చేయాల్సిన పోస్టుల సంఖ్య
సివిల్ పోస్టులు – 11
మెకానికల్ పోస్టులు – 09
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ – 04
కంప్యూటర్ SC & ఇంజనీరింగ్ / కంప్యూటర్ టెక్నాలజీ / M. Sc కంప్యూటర్ Sc – 06
ఎలక్ట్రానిక్స్ – 08
ఇతర ఇంజనీరింగ్ పోస్టులు – 02
మొత్తం పోస్టుల సంఖ్య – 40
ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం విద్యార్హత ఏమిటి?
అభ్యర్థి నోటిఫికేషన్‌లో ఇచ్చిన బ్రాంచ్‌లో ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ లేదా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ (BE/ B.Tech) అయి ఉండాలి.