Raithu Runamafi : అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా..హరీష్ రావు
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు.
- By Latha Suma Published Date - 04:45 PM, Mon - 23 December 24

Raithu Runamafi : మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ నెల 25న సీఎం మెదక్ పర్యటనను స్వాగతిస్తున్నాం అన్నారు. ఈ క్రమంలో ఏడుపాయల అమ్మవారి అమ్మవారి దగ్గర ముక్కు నెలకు రాసి ప్రయాశ్చిత్తం చేసుకో అని సూచించారు. రుణమాఫీ చేస్తానని మాట తప్పిన రేవంత్ క్రీస్తును క్షమించమని అడుగు అన్నారు. ముక్కోటి దేవుళ్ళ మీద ఒట్టేసి సీఎం రేవంత్ మాట తప్పిండ్రు అన్నారు. రైతులందరికీ ఎకరాకు రూ.15వేల రైతుబంధు ఇవ్వాలన్నారు. రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకుంటున్నారన్నారు. కౌలు రైలును సీఎం మోసం చేశాడని మండిపడ్డారు. సీఎం, మంత్రులకు కో ఆర్డినేషన్ లేదన్నారు.
అయినా ఏం ముఖం పెట్టుకొని సిగ్గులేకుండా మెదక్ కు వస్తున్నావ్. మెదక్ జిల్లాలో ఒక్కరోజే ముగ్గురు రైతులు, ఏడాది పాలనలో నాలుగైదు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని హరీష్ రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఏ ఊరుకైనా వెళ్లి రుణ మాఫీ అయిందా అని అడుగుదాం. అక్కడ రుణమాఫీ అయితే నేను ముక్కు నేలకు రాస్తా.. కాకుంటే నువ్వు రాస్తావా అని సీఎం రేవంత్ రెడ్డి కి హరీష్ రావు సవాల్ విసిరారు. రైతు భరోసా ఎప్పుడూ ఇస్తావని.. అడిగితె రెండు గంటల ఉపన్యాసమంతా చెత్త అని విమర్శించారు. ఏడాది పాలనలో రైతుబంధు ఇయ్యలే.. యాసంగి రైతుబంధు ఎప్పుడు ఇస్తావో చెప్పు అని అడిగామన్నారు
సీఎం రేవంత్ ఏడాది పాలనలో ఓర్లుడే కానీ.. ఓదార్పు లేదన్నారు. అడిగినవాళ్లను అదరగొడుతుండని.. ప్రశ్నిస్తే పగబడుతుండని మండిపడ్డారు. అసెంబ్లీ లో రేవంత్ అన్ని అబద్ధాలు మాట్లాడుతూ.. అసెంబ్లీని అపవిత్రం చేశాడంటూ మండిపడ్డారు. ధాన్యం కొనడంలో ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందన్నారు. ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్ముకున్నారని.. వడ్లు కొనడంలో చేతగాని ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రభుత్వమన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు ఇంకా డబ్బులు పడలేదన్నారు. రాష్ట్రంలో క్రైమ్‌రేట్ 41శాతం పెరిగిందని హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్ ఏడాది పాలనలో 25వేల కేసులయితే.. రేవంత్ పాలనలో 35వేల కేసులు పెరిగాయన్నారు. పరిపాలనలో సీఎంగా.. హోంమంత్రిగా ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. ఏడాదిలో తొమ్మిది మత కల్లోలాలు జరిగాయని.. అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల గురించి సీఎం చేతులెత్తెశారన్నారు.