Special Trains Extended : ఈ రూట్లలో స్పెషల్ రైళ్లు ఇంకొన్నాళ్లు పొడిగింపు
Special Trains Extended : వారానికి ఒకరోజు నడిచే స్పెషల్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్నాళ్లకు పొడిగించారు.
- By Pasha Published Date - 09:54 AM, Sat - 26 August 23
Special Trains Extended : వారానికి ఒకరోజు నడిచే స్పెషల్ రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్నాళ్లకు పొడిగించారు. కొన్ని ట్రైన్లను సెప్టెంబరు చివరి వారం వరకు, మరికొన్ని ట్రైన్లను అక్టోబరు 3 వరకు పొడిగించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఆ ట్రైన్లలో ప్రయాణికుల రద్దీ బాగానే ఉన్న రీత్యా వాటి సర్వీసులను ఇంకొన్నాళ్లు కొనసాగించాలని నిర్ణయించామని తెలిపింది. ఈ ట్రైన్లలో టికెట్ చార్జీలు కొంచెం అదనంగా ఉంటాయి.
సర్వీసులను పొడిగించిన స్పెషల్ ట్రైన్లు ఇవే..
కాజీపేట- దాదర్ మధ్య నడిచే ట్రైన్ ( ప్రతి బుధవారం, ట్రైన్ నెంబర్ 07195), దాదర్- కాజీపేట (ప్రతి గురువారం, ట్రైన్ నెంబర్ 07196), కాజీపేట- దాదర్ ( ప్రతి శనివారం ట్రైన్ నెంబర్ 07197), దాదర్- కాజీపేట ( ప్రతి ఆదివారం ట్రైన్ నెంబర్ 07198), దానాపుర్- సికింద్రాబాద్ (ప్రతి సోమవారం ట్రైన్ నెంబర్ 07420), సికింద్రాబాద్- రాక్సల్ ( ప్రతి బుధవారం ట్రైన్ నెంబర్ 07007), హైదరాబాద్- రాక్సల్ ( ప్రతి శనివారం ట్రైన్ నెంబర్ 07051), రాక్సల్ -సికింద్రాబాద్ (ప్రతి మంగళవారం ట్రైన్ నెబంర్ 07052), హైదరాబాద్- జైపుర్ ( ప్రతి శుక్రవారం ట్రైన్ నంబర్ 07115), జైపుర్-హైదరాబాద్ ( ప్రతి ఆదివారం ట్రైన్ నంబర్ 07116), సికింద్రాబాద్- దానాపుర్ ( ప్రతి శనివారం ట్రైన్ నంబర్ 07419), రాక్సల్- సికింద్రాబాద్ (ప్రతి శుక్రవారం ట్రైన్ నెబంర్ 07008), కాచిగూడ- బికనీర్ ( ప్రతి శనివారం ట్రైన్ నంబర్ 07053), బికనీర్- కాచిగూడ ( ప్రతి మంగళవారం ట్రైన్ నెంబర్ 07054) రైళ్ల సర్వీసులను (Special Trains Extended) పొడిగించారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు రైల్వే ప్రయాణికులను కోరారు.
Tags
Related News
Tirupati Trains Alert : తిరుపతికి వెళ్లే వారికి అలర్ట్.. ఆ రైళ్లు దారి మళ్లింపు.. కొత్తరూట్ ఇదీ
Tirupati Trains Alert : ఏటా సమ్మర్ టైంలో తిరుపతికి భక్తులు పెద్దసంఖ్యలో వెళ్తుంటారు.