HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Formula E Case Ktr Acb Appearance Telangana

KTR : ఫార్ములా ఈ కేసు.. నేడు ఏసీబీ ఎదుట హాజరుకానున్న కేటీఆర్

KTR : ఫార్ములా ఈరేస్ కేసు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఇందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏ1గా ఉన్నారు. మరో ఇద్దరు అధికారుల పేర్లు కూడా నమోదు చేశారు.

  • Author : Kavya Krishna Date : 06-01-2025 - 9:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ktr
Ktr

KTR : తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ కేసు కీలకంగా మారింది. ఈ కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణల పాలయ్యారు. తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో రూ. 55 కోట్లను విదేశీ సంస్థకు చెల్లించడంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఏసీబీ కేటీఆర్‌పై ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్లు 13(1)(ఏ), 13(2)తో పాటు ఐపీసీ సెక్షన్లు 409, 120(బి) కింద కేసు నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి పేర్లను కూడా నిందితులుగా చేర్చారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే ఏసీబీ కేసు నమోదు చేయగా, ప్రాథమిక వివరాలు సేకరించిన తర్వాత మరింత లోతుగా విచారణ చేపట్టాలని సిద్ధమవుతోంది.

 
Ayyappa Society : అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆదేశాలు
 

ఈ నేపథ్యంలోనే.. కేటీఆర్‌ ఈరోజు ఫార్ములా ఈ కారు రేసు కేసు విచారణలో భాగంగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఎదుట హాజరవుతున్నారు. ఈ సందర్భంగా, ఆయన ఉదయం 10 గంటలకు ఏసీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. ఈ కేసులో కేటీఆర్ గతంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కోరారు. కోర్టు తుదివిధి వెల్లడించడాన్ని నిలిపి ఉంచుతూ, అప్పటి వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని అధికారులను ఆదేశించింది. అయితే, విచారణ కొనసాగించేందుకు అనుమతించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల ప్రకారం, జనవరి 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని కోరింది. ఇదే కేసులో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కేటీఆర్‌ను జనవరి 7న విచారణకు పిలిచింది. ఇప్పటికే ఈ కేసులో నిందితులుగా ఉన్న బీఎల్ఎన్ రెడ్డి ,  అరవింద్ కుమార్‌ను ఈడీ జనవరి 2, 3 తేదీల్లో విచారణకు పిలిచింది. అయితే, వీరు మరింత సమయం కోరడంతో ఈడీ వారిని విచారణకు మరో వారం గడువు ఇచ్చింది. ఈ కేసు విచారణలో కేటీఆర్ హాజరుతోపాటు ఇతర నిందితుల విచారణ కీలక మలుపు తీసుకునే అవకాశముంది. కోర్టు తుదివిధి కోసం వేచిచూస్తున్నప్పటికీ, ఈ విచారణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారాయి.

Anantha Sriram : హిందూ ధర్మాన్ని అవమానించే సినిమాలను బహిష్కరించాలి : అనంత శ్రీరామ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ACB
  • Aravind Kumar
  • BLN Reddy
  • corruption investigation
  • enforcement directorate
  • Formula-E case
  • ktr
  • Telangana High Court
  • telangana politics

Related News

Actress Ashu Reddy

Ashu Reddy: అషు రెడ్డి కేసులో.. హైకోర్టు కీలక ఆదేశాలు

సినీ నటి అషురెడ్డి చుట్టూ గత కొద్దిరోజులుగా నెలకొన్న వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది. సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థల్లో తనపై వస్తున్న కథనాలపై ఆమె న్యాయపోరాటం చేస్తూ, చివరకు కోర్టు నుంచి మధ్యంతర ఉత్తర్వులను సాధించారు. హైదరాబాద్‌కు చెందిన ఎన్నారై ధర్మేంద్ర ఫిర్యాదుతో సీసీఎస్‌లో నమోదైన కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ తరుణంలో

  • KTR clarifies on organizations formed in his name

    KTR : కేటీఆర్ చెంప చెల్లుమనిపించాడు

  • KTR clarifies on organizations formed in his name

    BRS @ 25 Years : కేసీఆర్ ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యం – కేటీఆర్ ధీమా

  • Congress government has become a complete flop within two years: KTR

    BRS @ 25 Years : నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా అంటూ కేటీఆర్ ట్వీట్

  • Brs25years

    BRS @ 25 Years : ఉద్యమ పునాది.. ప్రగతి ప్రస్థానం – పాతికేళ్ల ‘గులాబీ’ జైత్రయాత్ర!

Latest News

  • GST : ఏప్రిల్ GST వసూళ్లలో రికార్డ్

  • Soap & Shampoo Price : సామాన్య ప్రజలపై మరో పిడుగు..భారీగా పెరిగిన సబ్బులు, షాంపూల ధరలు

  • Balayya : నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. బాలయ్య-కొరటాల కాంబో ఫిక్స్

  • Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • లంచం అడిగిన అధికారులపై.. చెప్పుతో కొట్టిన కండక్టర్

Trending News

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

    • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

    • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd