HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Govt Should Ban Films That Insult Hinduism Film Lyricist Anantha Sriram

Anantha Sriram : హిందూ ధర్మాన్ని అవమానించే సినిమాలను బహిష్కరించాలి : అనంత శ్రీరామ్

వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారు’’ అని అనంత శ్రీరామ్ (Anantha Sriram) తెలిపారు.

  • Author : Pasha Date : 05-01-2025 - 5:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anantha Sriram Hinduism Ban Films Ap Govt

Anantha Sriram : తెలుగు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటీవల కాలంలో పలు సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. కొన్ని సినిమాల్లో హైందవ పురాణాలను వక్రీకరించి చూపిస్తున్నారని ఆరోపించారు.  ప్లాన్ ప్రకారమే సినిమాల్లో హైందవ ధర్మ హననం జరుగుతోందని అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసే సినిమాలను ప్రభుత్వం వెంటనే బహిష్కరించాలని కోరారు. ‘‘మన దీక్ష దేవాలయ రక్ష’’ నినాదంతో ఇవాళ ఏపీలోని అమరావతి పరిధిలో ఉన్న కేసరపల్లిలో విశ్వహిందూ పరిషత్, హిందూ సంఘాలు హైందవ శంఖారావం బహిరంగ సభను ఏర్పాటు చేశాయి.  ఈ సభకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రజలు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంత శ్రీరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read :JC Prabhakar Reddy : ‘‘నేను మాట్లాడింది తప్పే..’’ నటి మాధవీలత‌కు జేసీ ప్రభాకర్‌రెడ్డి క్షమాపణలు

‘‘హిందూ సమాజానికి సినీ రంగం తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను. క్షమాపణ చెప్పకపోతే నాకు ఇక్కడ మాట్లాడే అర్హత లేదు. మన పురాణాలు, ఇతి హాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి చూపిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారు’’ అని అనంత శ్రీరామ్ (Anantha Sriram) తెలిపారు. ‘‘కల్కి 2898 ఏడీ సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారు. ఆయన్ను శూరుడు అంటే ఎవరు ఒప్పుకోరు. సినిమాల్లో పురాణాలపై ఇలాంటి వక్రీకరణలు చూసి నేనే సిగ్గుపడుతున్నాను. ఎవరు చేసినా తప్పును తప్పే అని చెప్పాలి’’ అని ఆయన తెలిపారు.

Also Read :Sankranti Special Trains : సంక్రాంతి స్పెషల్.. తెలుగు రాష్ట్రాలకు 52 అదనపు రైళ్లు

‘‘కల్కి సినిమాలో కర్ణుడి పాత్రకు ఆపాదించిన గొప్పతనాన్ని చూసి నేను సినిమా వాడిగా సిగ్గు పడుతున్నా. ఈ కృష్ణా జిల్లాకే చెందిన దర్శకులు, నిర్మాతలే ఈ పొరపాటు‌ గురించి చెప్పక‌పోతే ఎలా ? ఇలా పాత్రల ఔన్నత్యాన్ని మారిస్తే.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు’’ అని అనంత శ్రీరామ్ కామెంట్ చేశారు. ‘‘సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం. ఈ రెండింటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోంది. జరిగే తప్పులను తాను బాహాటంగానే విమర్శిస్తున్నాను. సినీ రంగానికి చెందిన వాడిగా ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం గురించి సమాజానికి చెబుతున్నాను’’ అని  అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anantha Sriram
  • andhra pradesh
  • ap govt
  • Ban Films
  • Film Lyricist
  • hinduism

Related News

New Wine Shops

మందుబాబులకు మరింత కిక్కు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

న్యూ ఇయర్ సందర్భంగా మద్యం అమ్మకాల పని వేళలను ఎక్సైజ్ శాఖ పొడిగించింది. డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు అమ్ముకునేందుకు మద్యం షాపులకు పర్మిషన్ ఇచ్చింది

  • Half Day Schools

    ఏపీలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులు ఖరారు

  • Selling Hair

    ఊడిపోయిన జుట్టును అమ్ముతున్నారా? తస్మాత్ జాగ్రత్త!

  • Dattatreya Temple Girnar

    గిర్నార్ దేవతల కొండల సీక్రెట్ స్టోరీ

  • Unified Family Survey

    ఏపీలో సమగ్ర కుటుంబ సర్వే.. తల్లికి వందనం, ఇతర పథకాలపై ప్రభావం?!

Latest News

  • 2025 లో తెలుగు లో బ్లాక్ బస్టర్ మూవీ ఇదే !!

  • జూనియర్ సమంత అందాల ఆరబోత..! నీకు మంగపతే కరెక్ట్ అంటోన్న నెటిజన్లు

  • మరోసారి ఆజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ ?

  • మరో ఘోరం.. ఇన్సూరెన్స్ కోసం తండ్రిని పాముతో కాటేపించి చంపిన కొడుకులు

  • ఆ జిల్లాలోనే మరో కొత్త పోర్టు.. ప్రకటించిన సీఎం చంద్రబాబు !

Trending News

    • కొత్త సంవత్సరం వేళ దిగొచ్చిన వెండి, బంగారం ధరలు!

    • రేపే ఏకాద‌శి.. ఇలా చేయ‌కుంటే పూజ చేసిన వృథానే!!

    • ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై ప్రధాన బ్యాంకుల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే?

    • రాజా సాబ్ మూవీ నుంచి మ‌రో ట్రైల‌ర్‌.. ఎలా ఉందంటే?!

    • 2025 లో కూటమి ప్రభుత్వం సాధించిన 60 విజయాలు !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd