Monkeypox : ఢిల్లీలో నాలుగు చేరిన మంకీపాక్స్ కేసులు… దేశ వ్యాప్తంగా 9 కేసులు నమోదు
ఢిల్లీలో బుధవారం 31 ఏళ్ల మహిళ మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్
- By Vara Prasad Published Date - 10:25 PM, Wed - 3 August 22

ఢిల్లీలో బుధవారం 31 ఏళ్ల మహిళ మంకీపాక్స్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఢిల్లీలో ఇప్పటి వరకు నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదైయ్యాయి. ఆ మహిళ చికిత్స కోసం ఎల్‌ఎన్‌జేపీ, ఢిల్లీ నోడల్ ఆసుపత్రిలో చేరింది. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. కేరళ నుండి ఐదు కేసులు, ఒక మరణంతో సహా, ఢిల్లీ నుండి నాలుగు కేసులు ఉన్నాయి. మంకీపాక్స్ కేసుల కోసం ఐసోలేషన్ గదులను తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం ఆసుపత్రులను ఆదేశించింది.పెరుగుతున్న మంకీపాక్స్ కేసుల నేపథ్యంలో, సఫ్దర్‌జంగ్, ఆర్‌ఎమ్‌ఎల్ మరియు లేడీ హార్డింజ్ అనే మూడు ఆసుపత్రులలో ఐసోలేషన్ గదులు ప్రారంభించబడ్డాయని వైద్యాఆరోగ్యశాఖ తెలిపింది. మంకీపాక్స్ కేసుల నిర్వహణ కోసం కనీసం 10 ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది
Related News

Canada : కెనడాని భయపెడుతున్న మంకీపాక్స్ .. 957 కేసులు నమోదు
కెనడాలో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 957 మంకీపాక్స్ కేసులనుకెనడా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ