Rahul Gandhi: రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు
మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఆయన పదవికే గండంగా మారింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవి అర్హతను కోల్పోయారు.
- Author : Praveen Aluthuru
Date : 14-06-2023 - 6:24 IST
Published By : Hashtagu Telugu Desk
Rahul Gandhi: మోడీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ చేసిన ప్రకటన ఆయన పదవికే గండంగా మారింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ తన ఎంపీ పదవి అర్హతను కోల్పోయారు. ఇక తాజాగా రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. తాజాగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది. అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలకు పాల్పడింది. ఎన్నికలకు ముందున్న బీజేపీ ప్రభుత్వం పదవి కాలంలో రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. అప్పటి బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్‌కు పాల్పడిందని పేర్కొంది. ఈ విధంగా నాలుగేళ్లలో బీజేపీ రూ.1.5 లక్షల కోట్ల కుంభకోణం చేసిందన్నారు. దీంతో ఇప్పుడు ఆ ప్రకటన కాంగ్రెస్ మెడకు చుట్టుకుంది.
కర్నాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటన రాహుల్ గాంధీకి మళ్లీ కష్టాలను తెచ్చిపెట్టింది. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి కర్ణాటక అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నోటీసు పంపారు. రాహుల్‌తో పాటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లకు కోర్టు నోటీసులు పంపింది. మాజీ, సిట్టింగ్ ఎంపీలు/ఎమ్మెల్యేలకు సంబంధించిన క్రిమినల్ కేసులను విచారించే ప్రత్యేక న్యాయస్థానం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఐపీసీ సెక్షన్లు 499 (పరువు నష్టం) మరియు 500 (పరువు నష్టం కోసం శిక్ష) కింద కోర్టు దీనిని పరిగణలోకి తీసుకుంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ రోయ్ సమన్లు జారీ చేయాలని ఆదేశించింది.
కాంగ్రెస్ అవినీతి ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కేశవప్రసాద్ మే 9న ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రకటనలతో బీజేపీ పరువు తీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న ఈ ఆరోపణలు నిరాధారమైనవి, పక్షపాతంతో కూడినవి మరియు పరువు నష్టం కలిగించేవని తెలిపారు.
Read More:Senthil Balaji Arrest: తమిళనాడు మంత్రి అరెస్టు కేవలం ప్రతీకార చర్య: ప్రతిపక్షాలు