Maun Satyagraha: జూలై 12న కాంగ్రెస్ ‘మౌన్ సత్యాగ్రహం’
కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత వేటుపై బీజేపీపై యుద్ధం ప్రకటించింది ఆ పార్టీ. బీజేపీ డర్టీ పాలిటిక్స్ అంటూ అభివర్ణిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది
- Author : Praveen Aluthuru
Date : 09-07-2023 - 9:06 IST
Published By : Hashtagu Telugu Desk
Maun Satyagraha: కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఎంపీ అనర్హత వేటుపై బీజేపీపై యుద్ధం ప్రకటించింది ఆ పార్టీ. బీజేపీ డర్టీ పాలిటిక్స్ అంటూ అభివర్ణిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి రాష్ట్ర రాజధానిలో మహాత్మాగాంధీ విగ్రహాల దగ్గర ‘మౌన్ సత్యాగ్రహం’ నిర్వహించనుంది. జూలై 12న ‘మౌన్ సత్యాగ్రహానికి దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలు సిద్ధమయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాహుల్ గాంధీ బీజేపీ అవినీతిని బయటపెట్టినందుకే బీజేపీ చీప్ పాలిటిక్స్ చేస్తుందన్నారు వేణుగోపాల్. రాహుల్ భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాని మోడీ మరియు అదానీ గ్రూప్ మధ్య సంబంధాన్ని వెలికితీశారని చెప్పారు. తత్ఫలితంగా తనను పార్లమెంట్‌కు అనర్హులుగా చేసేందుకు బిజెపి తన డర్టీ ట్రిక్స్‌ను ప్రయోగించిందని ఆయన ఆరోపించారు.
Read More: YSRCP vs JSP : పవన్ కళ్యాణ్ చేసేది “నారాహి” యాత్ర – ఏపీ మంత్రి మేరుగ నాగార్జున