HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy To Hand Over Compassionate Appointment Documents When

CM Revanth Reddy: కారుణ్య నియామ‌క పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎప్పుడంటే?

పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేవ‌నే కార‌ణంతో కారుణ్య నియామకాలను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. తమకు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన గ‌త ప్ర‌భుత్వం పెడ చెవిన పెట్టింది.

  • Author : Gopi Date : 19-03-2025 - 10:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CM Revanth Reddy
CM Revanth Reddy
  • ర‌వీంద్రభార‌తిలో రేపు కారుణ్య నియామ‌క ప‌త్రాల అంద‌చేత కార్య‌క్ర‌మం
  • మంత్రి సీత‌క్క అధ్య‌క్ష‌త‌న సాయంత్రం 4 గంట‌ల‌కు స‌భా కార్య‌క్ర‌మం
  • సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌, పుర‌పాల‌క శాఖ‌లో ఉద్యోగ నియామ‌క ప‌త్రాల అంద‌జేత‌

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్ర‌భుత్వం మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పంచాయతీ రాజ్ శాఖలో జిల్లా ప్రజా పరిషత్తులు, మండల ప్రజా పరిషత్తులు, పంచాయతీ రాజ్ శాఖలోని పాఠశాలల్లో పనిచేస్తున్న‌ ఉద్యోగులు సర్వీసులో ఉండగా అకాల మరణం చెందారు. కానీ వారి మీద ఆధారపడిన వారసులకు గత పది సంవత్సరాలుగా కారుణ్య నియామకాలు చేప‌ట్ట లేదు. తగిన సమయములో కారుణ్య నియామకాలు జరగనందున, సంపాదించే కుటుంబ పెద్ద మరణించినందున ఆ కుటుంబాలు తీవ్రమైన ఆర్ధిక, మానసిక ఇబ్బందులకు గురైయ్యాయి.

ఇతర శాఖలలో వెంటనే కారుణ్య నియామకాలు జ‌రిగినా.. పంచాయతీ రాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా లేవ‌నే కార‌ణంతో కారుణ్య నియామకాలను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. తమకు వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ఆయా కుటుంబాలు ప్రభుత్వానికి ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన గ‌త ప్ర‌భుత్వం పెడ చెవిన పెట్టింది. అయితే వారి ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని వారి నియామ‌కం ప‌ట్ల సానుకూలంగా వ్య‌వ‌హ‌రించారు పంచాయ‌తీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీత‌క్క.

Also Read: IPL Opening Ceremony: ఐపీఎల్ ప్రారంభ వేడుక‌లు.. 13 స్టేడియాల్లో రంగం సిద్ధం!

సీత‌క్క ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవ‌డంతో నిరీక్ష‌ణ‌కు తెర‌

పంచాయ‌తీ రాజ్ విభాగంలో 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసేలా ప్ర‌భుత్వాన్ని సీత‌క్క ఒప్పించారు. దీంతో ఎప్పుడూ లేని విధముగా 582 సూపర్ న్యూమరరీ జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ప్ర‌భుత్వం మంజూరు చేయ‌డంతో కారుణ్య నియ‌మాకాల‌కు మార్గం సుగుమమైంది. 582 కారుణ్య నియామ‌కాల‌తో పాటు, మిషన్ భగీరథ శాఖలో 55 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 27 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో 38 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 55 మంది జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీత‌క్క అందజేయనున్నారు. కారుణ్య నియామ‌కాల‌కు అనుమ‌తులిచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మ‌ల్లు బ‌ట్టి విక్ర‌మార్క‌కు సీత‌క్క ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • CM Revanth Reddy
  • congress
  • hyderabad
  • Minister Seethakka
  • Ravindrabarathi
  • telangana

Related News

CM Revanth Reddy's meeting cancelled.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధిర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగ

  • CM Revanth Reddy's meeting cancelled.

    Revanth Reddy: మెట్రో రైల్ పై రేవంత్ విజయం

Latest News

  • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

  • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

  • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

  • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

  • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd