Raj Bhavan : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ
Raj Bhavan : సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని సీఎం గవర్నర్‌కు చెప్పారు.
- By Latha Suma Published Date - 09:51 PM, Wed - 6 November 24

Governor Jishnu Dev Varma : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సమావేశమయ్యారు. ఈ భేటిలో కుల గణన, మూసి ప్రక్షాళన పై గవర్నర్ తో రేవంత్ చర్చించారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభమైన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన తీరు గురించి సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్‌కు వివరించారు. ఈ ప్రక్రియకు సంబంధించి పూర్తి స్థాయి వివరాలను గవర్నర్ కు తెలిపారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వే విషయంలో దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా నిలవనుందని సీఎం గవర్నర్‌కు చెప్పారు.
రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ గారితో మర్యాదపూర్వకంగా భేటీ కావడం జరిగింది.
రాష్ట్రంలో నేటి నుండి ప్రారంభమైన కుల గణన, దాని అవశ్యకత, అనుసరిస్తోన్న విధానం పై గవర్నర్ గారికి వివరించడం జరిగింది.@Jishnu_Devvarma pic.twitter.com/0Ys2nfo1kM— Revanth Reddy (@revanth_anumula) November 6, 2024
2025వ సంవత్సరంలో చేపట్టే దేశవ్యాప్త జనగణనలో తెలంగాణ సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులసర్వేను పరిగణనలోకి తీసుకునే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి గవర్నరు జిష్ణుదేవ్ వర్మను కోరారు.ఈ సందర్భంగా తన సోదరుడి కూతురు వివాహానికి గవర్నర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
కాగా, గతకొన్ని రోజులుగా జిష్ణుదేవ్ వర్మ జ్వరంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం.. మంత్రులతో కలిసి వెళ్లి గవర్నర్ ను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీలు బలరాం నాయక్, కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్ భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తదితరులు ఉన్నారు.
Read Also: Amrapali Kata : ఏపీలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాటా