Amrapali Kata : ఏపీలో బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి కాటా
Amrapali Kata ఇటీవల తెలంగాణలోనే కొనసాగించాలని ఆమ్రపాలితో పాటు పలువురు ఐఏఎస్ ల బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వీరి వాదనలను న్యాయమూర్తులు తోసిపుచ్చడం తెలిసిన విషయమే.
- Author : Latha Suma
Date : 06-11-2024 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
Amrapali kata Taken Charge : ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటా ఏపీ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ వైస్-ఛైర్మన్, ఎండీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ హైకోర్టు తీర్పు నేపథ్యంలో అమ్రపాలి రాష్ట్రానికి వచ్చి రిపోర్టు చేశారు. ఇక బాధ్యతలు స్వీకరించిన అనంతరం.. ఆమ్రపాలిపర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఉద్యోగులు.. ఆమ్రపాలిని సత్కరించారు. ఇటీవల తెలంగాణలోనే కొనసాగించాలని ఆమ్రపాలితో పాటు పలువురు ఐఏఎస్ ల బృందం కేంద్రానికి విజ్ఞప్తి చేసినప్పటికీ వీరి వాదనలను న్యాయమూర్తులు తోసిపుచ్చడం తెలిసిన విషయమే.
ఇకపోతే..ఏపీలోని విశాఖపట్నంలో ఆమ్రపాలి జన్మించారు. ఆమ్రపాలి తండ్రి వెంకటరెడ్డి ఆంధ్రా యూనివర్సిటీలో ఆర్ధికశాస్త్ర ఆచార్యులుగా పనిచేశారు. విశాఖపట్నంలో ప్రాథమిక విధ్యాభ్యాసం పూర్తి చేసిన ఆమ్రపాలి.. చెన్నైలోని ఐఐటీ మద్రాస్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఆ తర్వాత ఐఐఎం బెంగళూరులో ఎంబీఏ పూర్తి చేశారు. యూపీఎస్సీ పరీక్షల్లో 39వ ర్యాంక్ సాధించిన ఆమ్రపాలి.. 2010 వ సంవత్సరపు బ్యాచ్ ఐఏఎస్ అధికారి. అలాగే ఐఏఎస్‌కు చిన్న వయసులోనే ఎంపికై ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అంతేకాక..ఆమె సోషల్ మీడియా వేదికగా పలు సలహాలు ఇచ్చి యువతకు ప్రేరణగా నిలిచారు.
కాగా, ఆమ్రపాలి కాటా తెలంగాణలో వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన .. వివిధ హోదాలలో పని చేశారు. అనంతరం కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆమ్రపాలిని తెలంగాణకు తీసుకువచ్చారు. ఆ తర్వాత తెలంగాణలో పలు హోదాల్లో పనిచేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గానూ వ్యవహరించారు. అయితే ఐఏఎస్‌ల బదిలీపై క్యాట్ ఉత్తర్వుల మేరకు ఆమ్రపాలి సొంతరాష్ట్రమైన ఏపీకి బదిలీ అయ్యారు. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆమ్రపాలి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు కూడా క్యాట్ తీర్పుతో ఏకీభవించింది. దీంతో గత నెలలో ఆమ్రపాలి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు.
Read Also: Roop Kund : వామ్మో ఆ సరస్సు చుట్టూ అస్థిపంజరాలే..!