HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Cm Revanth Reddy Key Announcements On Telangana Formation Day 2025

CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.

  • Author : Kavya Krishna Date : 02-06-2025 - 11:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Revanth Reddy
Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్‌పార్క్‌ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు కవాతు అనంతరం, ఉత్తమ సేవలందించిన పోలీసు సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి మెడల్స్ అందజేశారు.. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనేది మా ఆలోచన అని, మహిళా సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించామన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించామని, రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేలు ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని, రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి పెరిగి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 8 వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు దళారుల బారిన పడకుండా చేశామని రేవంత్ రెడ్డి అన్నారు.

అంతేకాకుండా.. భూభారతితో భూములకు రక్షణ కల్పిస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. 8 నెలల్లో 25 లక్షల 35 వేల మంది రైతులకు రూ.20,617 కోట్లు రుణమాఫీ చేశామని, భూమిలేని వ్యవసాయ రైతు కూలీల కుటుంబానికి ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామన్నారు. డీఎస్సీ ప్రకటించి 10 వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామని, ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.

CM Chandrababu : తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలి

యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నామని, 27 ఎకరాల్లో రూ.2,700 కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి భవనాలను నిర్మిస్తున్నామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. శాస్త్రీయంగా కులగణన నిర్వహించి బీసీల లెక్క 50.36 శాతంగా తేల్చామని, తెలంగాణ బాటలోనే కేంద్రం కూడా జనగణనలో కులగణన చేపట్టేందుకు సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి

ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై మా ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని, ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, మే 20 నాటికి 5,364 మంది లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమచేశామన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. సంక్షేమ పథకాల చరిత్రలో సన్నబియ్యం ఒక ట్రెండ్ సెట్టర్.. ఇప్పటివరకు 3 లక్షల కోట్లు పెట్టుబడులు సాధించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపడుతున్నామని, 30 వేల ఎకరాలలో ఫ్యూచర్ సిటీ కోసం ప్రణాళిక రచించుకున్నామన్నారు రేవంత్‌ రెడ్డి. మిస్ వరల్డ్ పోటీలతో తెలంగాణ చారిత్రక, టూరిజం ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేశాం.. తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Heavy Rains : ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు.. కొండచరియలకు 34 మంది బలి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bc reservations
  • Bhubharati
  • caste census
  • Farmers' Welfare
  • Food Security
  • Free RTC Travel
  • Future City
  • Indiramma Housing
  • Loan Waiver
  • Miss World Telangana
  • Moosi River
  • Osmania hospital
  • political news
  • revanth reddy
  • Teacher Recruitment
  • telangana
  • Telangana formation day
  • Trillion Economy
  • women empowerment
  • Young India Schools

Related News

Tgpsc Group 3 Results

గ్రూప్-3 ఫలితాలను విడుదల చేసిన టీజీపీఎస్సీ

గ్రూప్ 3 అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీపి కబురు అందించింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి తుది ఫలితాలను గురువారం విడుదల చేసింది.మొత్తం 1,388 పోస్టులకు గాను ప్రస్తుతం 1,370 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు కమిషన్ ప్రకటించింది

  • CM Revanth Leadership

    సీఎం రేవంత్ నాయ‌క‌త్వానికి బ్ర‌హ్మ‌ర‌థం!

  • Ration Shop

    రేషన్‌కార్డుదారులకు హెచ్చరిక.. E KYC చేయకపోతే సన్నబియ్యం కట్

  • New Sarpanches

    తెలంగాణ‌లో కొత్త సర్పంచుల అపాయింట్‌మెంట్‌ డే ఈనెల 20 నుండి 22కు వాయిదా!

  • Special Trains Sankranti 20

    దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Latest News

  • చలికాలంలో ఈ ఫుడ్స్ తింటే అంతే.. ఫుడ్ ఎక్సపర్ట్స్ వార్నింగ్

  • ఈ ఏడాది చివరి అమావాస్య.. ఏ రోజు వచ్చిందో తెలుసా ప్రాముఖ్యత ఇదే

  • డిసెంబర్ 22 న జనసేన ‘పదవి-బాధ్యత’ సమావేశం

  • సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట

  • నిధి అగర్వాల్ చేదు అనుభవం, మాల్ ఆర్గనైజర్లపై కేసు నమోదు

Trending News

    • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

    • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    • KPHB లులు మాల్‌లో నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం

    • స్టాక్ మార్కెట్‌ను లాభ- న‌ష్టాల్లో న‌డిపించే 7 అంశాలివే!

    • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd