HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Chandrababu Approves Ttd Changes Ai Based System Vip Darshan

CM Chandrababu : శ్రీవారి భక్తుల దర్శనంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కలిశారు. ఈ సమావేశంలో, టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై ఛైర్మన్ బీఆర్ నాయుడుని ముఖ్యమంత్రి అభినందించారు.

  • Author : Kavya Krishna Date : 31-12-2024 - 10:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cm Chandrababu, Br Naidu
Cm Chandrababu, Br Naidu

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. టీటీడీ పాలకమండలి తీసుకునే నిర్ణయాలపై బీఆర్ నాయుడు అభినందించారు ముఖ్యమంత్రి. తిరుమలలో భక్తులు క్యూ లైన్‌లో గంటలు వేచి ఉండకుండా, త్వరితగతిన దర్శనం పొందేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్‌ వివరించారు. ఈ నిర్ణయానికి చంద్రబాబు పూర్తి సమ్మతి తెలిపారు. ఈ ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్స్‌పర్ట్స్‌తో మూడు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని టీటీడీ ఛైర్మన్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.

చంద్రబాబు ఈ అంశంపై సానుకూలంగా స్పందిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక సంస్థలతో సంప్రదింపులు జరపాలని, తక్షణమే ఈ నిర్ణయంపై చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, “తిరుమలలో భక్తులు వేచి ఉండకుండా, త్వరితగతిన దర్శనం పొందే మార్గాన్ని కనుగొనడం ఎంతో ముఖ్యమైన అంశం” అని పేర్కొన్నారు.

స్విమ్స్ ఆస్పత్రికి సంబంధించి, ప్రతి ఏడాది రూ.100 కోట్లు నష్టం వచ్చిన విషయంపై టీటీడీ ఛైర్మన్, సీఎం చంద్రబాబుకు వినతి పత్రం అందించారు. ఆరోగ్య శ్రీ నుండి రూ.80 కోట్లు అందించాలని కోరారు. ఈ విషయాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

స్విమ్స్‌‌లో నూతన భవనాల నిర్మాణంపై కూడా ముఖ్యమంత్రి దృష్టిని తీసుకెళ్లారు. కానీ, పాలకమండలి నిర్ణయ ప్రకారం, భవనాల నిర్మాణం వెంటనే ఆపాలని సిఫారసు చేయటానికి చంద్రబాబు ఆదేశించారు. తిరుమల ఆలయంలో భక్తులు తోపులాట కారణంగా, నేమ్ బ్యాడ్జ్ వేసే నిర్ణయాన్ని టీటీడీ తీసుకున్నట్లు బీఆర్ నాయుడు ముఖ్యమంత్రికి వివరించారు.

ఎస్వీబీసీ ఛానల్‌కు త్వరలో ఛైర్మన్ నియామకం జరగబోతున్నట్లు టీటీడీ ఛైర్మన్ తెలిపారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను తిరుమలలో తీసుకున్న నిర్ణయాలపై చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అన్యమతస్థుల అంశంపై కూడా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు, వాస్తవానికి పాలకమండలి నిర్ణయాలు తీసుకునే అంశాలపై అతను తక్షణమే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.

అంతేకాక, ఎస్వీబీసీలో ఉద్యోగుల ఫిర్యాదుల నేపథ్యంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ సూచించారు, దీని కోసం కూడా చంద్రబాబు ఓకే ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో డిప్యుటేషన్ 2పై విధించబడిన ఎనిమిది అధికారులను బదిలీ చేయాలని కోరిన టీటీడీ ఛైర్మన్, చంద్రబాబు తక్షణమే అనుమతి ఇచ్చారు.

Weight Loss : బ్రౌన్‌ షుగర్ లేదా తేనె.. బరువు తగ్గడానికి ఏది ఎక్కువ ప్రయోజనకరం..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • Artificial Intelligence
  • chandrababu naidu
  • Devotee Safety
  • SVBC Channel
  • Telangana Recommendations
  • tirumala
  • Tirupati
  • ttd
  • TTD Decisions
  • VIP darshan

Related News

Sundar Pichai

ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్‌ లో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ సమ్మిట్ సందర్భంగా మన జాతీయ మీడియాతో ఆయన కాలిఫోర్నియా నుంచి వర్చువల్ గా మాట్లాడుతూ… భారత్‌ తో గూగుల్ భవిష్యత్ భాగస్వామ్యం గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పిచాయ్ వ్యాఖ్యల్లో కీలక అంశాలు: భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోంది. ఏఐ వ

    Latest News

    • AP Debt : 18 నెలల్లో కూటమి సర్కార్ రూ.3.17 లక్షల కోట్లు చేసింది – జగన్

    • అభిషేక్ శ‌ర్మ‌లో ఉన్న బ‌ల‌హీన‌త‌లు ఇవేనా?!

    • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లలో జల్సాలు చేస్తున్నాడు – జగన్

    • టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో సంచ‌ల‌నం.. శ్రీలంక‌పై జింబాబ్వే ఘ‌న‌విజ‌యం!

    • Prabhas -Prashanth Varma Project : ప్రభాస్-ప్రశాంత్ వర్మ సినిమాపై క్లారిటీ

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2028కు 12 జట్లు క్వాలిఫై.. లిస్ట్ ఇదే!

      • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

      • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

      • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

      • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd