Viral : సోషల్ మీడియా లో వైరల్ గా మారిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాసలీలలు
వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ రాసలీలలు
- Author : Sudheer
Date : 20-08-2023 - 11:35 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) లో మరో మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే తమ అభ్యర్థుల లిస్ట్ ను సిద్ధం చేసి ఉంచగా..అధికార పార్టీ బిఆర్ఎస్ సైతం రేపు మొదటి విడత అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించబోతుంది. దాదాపు 90 మందితో కూడిన ప్రకటనను కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో మూడోసారి విజయం సాధించి సత్తా చాటాలని బిఆర్ఎస్ భావిస్తుంది. మరోపక్క కాంగ్రెస్ , బిజెపి పార్టీలు మాత్రం ఆ ఛాన్స్ బిఆర్ఎస్ కు ఇవ్వకూడదని గట్టిగానే ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఈ తరుణంలో బిఆర్ఎస్ నేతలపై గట్టి నిఘా పెట్టింది.
అధికార పార్టీ నేతలకు సంబదించిన రహస్యాల ఫై ఫోకస్ చేసి..వాటితో బిఆర్ఎస్ ఫై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా చేయాలనీ చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో వైరా మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ (Ex MLA Banoth Madan Lal) రాసలీలలు అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా (Private Photos) మారాయి. ఓ మహిళతో రాసలీలలు చేస్తున్నట్లు ఉన్న ఫోటోలు బిఆర్ఎస్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఫొటోస్ ఫై ప్రతిపక్ష పార్టీలతో పాటుసొంత పార్టీలోని ఆశావాహులు ప్రధానాస్త్రాలుగా మలుచుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.
ఈ ఫొటోస్ ఫై మదన్ లాల్ వర్గం ఘాటుగానే సమాధానమిస్తున్నారు. అవి మార్ఫింగ్ ఫొటోలు అని ఆరోపించారు. మదన్‌లాల్‌కే బీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ ఇవ్వనుందని, అది తట్టుకోలేకే ఎమ్మెల్యే రాములు నాయక్ (Ramulu Naik) వర్గమే ఈ పని చేయించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై రాములు నాయక్ వర్గం స్పందిస్తూ ఒకరి ఫొటోలను వైరల్ చేయాల్సిన అవసరం తమకు లేదని చెబుతోంది. ఈ రాసలీలల ఫొటోల వ్యవహారంపై మదన్‌లాల్ నేరుగా స్పందించాల్సి ఉంది.
ప్రస్తుతం వైరా (Wyra ) సిట్టింగ్ ఎమ్మెల్యేగా రాములు నాయక్ ఉన్నారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ కష్టమని ప్రచారం జరగుతోంది. దీంతో మాజీ ఎమ్మెల్యేలు బానోతు మదన్ లాల్, చంద్రావతిలో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు మదన్‌లాల్‌కు టికెట్ ఓకే అయిందన్న ప్రచారం గట్టిగా వినిపిస్తుంది. ఈ క్రమంలో ఆయన ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నారంటూ ఫోటోలు బయటకు రావటం కలకలం రేపుతోంది.
Read Also : Monsoon Health Tips: మీరు వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఇంటి చిట్కాలు పాటించండి..!