YCP : వైసీపీకి మరో బిగ్‌షాక్.. పార్టీని వీడుతున్న కర్నూల్ ఎంపీ
వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ జాబితాలో మరో ఎంపీ ఉన్నారు.
- By Prasad Published Date - 07:17 AM, Thu - 11 January 24

వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే టికెట్ దక్కని నేతలు పార్టీలు మారుతున్నారు. ఈ జాబితాలో మరో ఎంపీ ఉన్నారు. కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవ్ కుమార్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో కర్నూలు లోక్‌సభ స్థానం మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్ పార్టీ అభ్యర్థిగా వైఎస్‌ఆర్‌సీ అభ్యర్థిగా పోటీ చేస్తారని అధిష్టానం ప్రకటించడంతో డాక్టర్ సంజీవ్ కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత ఎంపీ సంజయ్ కుమార్ చేనేత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.. ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజికవర్గ సభ్యుడిగానే కాకుండా డాక్టర్‌గానూ సంజయ్ కుమార్‌కు ఆదరణ ఉంది. అయితే ఆయన్ని కాదన్ని గుమ్మనూరు జయరాంని ఈ సారి ఎంపీ అభ్యర్థిగా వైసీపీ బరిలోకి దింపుతుంది.
Also Read: TDP : వైసీపీ నేతలు మెక్కిందంతా కక్కిస్తాం.. తుని రా.. కదలి రా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు