Balagam Actor: బలగం నటుడు జీవీ బాబు కన్నుమూత
ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు జీవీ కన్నబాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
- By Gopichand Published Date - 10:24 AM, Sun - 25 May 25

Balagam Actor: ప్రముఖ రంగస్థల కళాకారుడు, బలగం సినిమా నటుడు (Balagam Actor) జీవీ కన్నబాబు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వరంగల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జీవీ బాబు మరణంపై బలగం డైరెక్టర్ వేణు విచారం వ్యక్తం చేశారు. జీవీ బాబు డైరెక్టర్ వేణు రూపొందించిన బలగం మూవీలో ఓ కీలక పాత్రలో పోషించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న జీవీ బాబు
బలగం సినిమాలో అంజన్న పాత్రలో నటించిన జీవీ బాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జీవీ బాబు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని, మూత్రపిండ సమస్యల కారణంగా వరంగల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చికిత్స పొందుతున్నారని ఇటీవల కథనాలు కూడా వచ్చాయి. ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని, ఆసుపత్రి ఖర్చుల కోసం దాతల సహాయం కోసం కుటుంబం ఎదురుచూస్తోందని ఇటీవల వార్తలు వచ్చాయి. బలగం దర్శకుడు వేణు, హీరో ప్రియదర్శి ఆర్థిక సహాయం అందించినప్పటికీ జీవీ బాబు ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. జీవీ బాబు జీవితం అంతా నాటకరంగంలోనే గడిపారని, ఆయనను బలగం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసే భాగ్యం తనకు వచ్చిందని డైరెక్టర్ వేణు తెలిపారు.
Also Read: Dark Circles: కంటి కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!