Dark Circles: కంటి కింద నల్లటి వలయాలతో బాధపడుతున్నారా.. అయితే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే!
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని బ్యూటీ ప్రోడక్టులు ఉపయోగించి నా కళ్ళ కింద నల్లటి వలయాలు పోవడం లేదా, అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Sun - 25 May 25

చాలా మందికి డార్క్ సర్కిల్స్ సమస్యలు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖం అందవిహీనంగా కనిపిస్తూ ఉంటుంది. వీటిని కవర్ చేసుకోవడం కోసం పెద్ద మొత్తంలో మేకప్ వేసుకుంటూ ఉంటారు. అయితే డార్క్ సర్కిల్స్ రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. మొబైల్ ఫోన్లు లాప్టాప్ లు వంటివి ఎక్కువ సేపు చూడడం సరిగా నిద్రపోకపోవడం లాంటి కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే వీటిని ఎలా తగ్గించుకోవాలో అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముందుగా గోరువెచ్చని కొబ్బరినూనెను తీసుకుని కళ్లచుట్టూ రాసుకుని అది చర్మంలోకి ఇంకేలా ఆరిపోయేంత వరకు మునివేళ్లతో 5 నిమిషాల పాటు మర్దన చేస్తూ ఉండాలి. ఇలా తరచూ చేయడం వల్ల సున్నితమైన కళ్లకింది చర్మాన్ని బిగుతుగా చేయడమే కాకుండా నలుపుదనాన్నీ తగ్గిస్తుందట. బ్లాక్ లేదా గ్రీన్ టీ కూడా కంటి వలయాలు తగ్గేందుకు సహాయపడుతుందట. వాడిన టీ బ్యాగులను కొద్దిసేపు ఫ్రిజ్ లో పెట్టేసి ఆ తర్వాత కళ్లమీద పావుగంట ఉంచితే సరిపోతుందని చెబుతున్నారు. అదేవిధంగా కీరదోసకాయ ముక్కలను గుండ్రంగా కట్ చేసి కళ్ళపై పెట్టుకుని 15 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది చెబుతున్నారు.
అదేవిధంగా కీర దోసకాయ రసం నిమ్మరసం సమానంగా తీసుకుని కళ్ళ కింద దూది సహాయంతో అప్లై చేసి ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేస్తే మంచి ప్రయోజనాలు కనిపిస్తాయట. అలాగే ఆలుగడ్డ తొక్కతో కళ్ళ కింద రుద్దడం వల్ల కూడా ఈ డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయట. లేదా బంగాళాదుంప రసం రాసుకుని 15 నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగినా చక్కని ఫలితం ఉంటుందని, టొమాటో చిన్న ముక్క తీసుకుని రుద్ది, పది నిమిషాలయ్యాక చల్లని నీటితో తరచూ కడగడం వల్ల కంటి కింద నల్లటి వలయాలు క్రమంగా తగ్గిపోతాయని చెబుతున్నారు. రాత్రి నిద్రపోయే ముందు గులాబీ నీటిలో ముంచిన దూదిని కళ్లమీద పెట్టుకుంటే చాలట. ఇలా పైన చెప్పిన చిట్కాలు తరచూ ఫాలో అవ్వడం వల్ల కళ్ళ కింద నల్లటి వలయాలు ఉండవు అని చెబుతున్నారు.