CM Jagan Tour In Tiruvuru : రేపు సీఎం జగన్ తిరువూరు పర్యటన.. భారీ వర్షానికి నేల కూలిన జగన్‌ఫ్లెక్సీలు
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు తిరువూరులో పర్యటించనుననారు. విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులు విడుదల
- Author : Prasad
Date : 18-03-2023 - 5:11 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రేపు తిరువూరులో పర్యటించనుననారు. విద్యాదీవెన పథకానికి సంబంధించి నిధులు విడుదల చేసేందుక ఆయన రేపు తిరువూరు రానున్నారు. మొదటిగా ఈ రోజు కార్యక్రమం నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఇంటర్ పరీక్షల నేపథ్యంలో రేపు (ఆదివారం) నిర్వహిస్తున్నారు. అయితే జగన్ పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ పకృతి మాత్రం కన్నెర్ర చేసింది. పర్యటనకు రెండు రోజుల ముందు నుంచి తిరువూరులో భారీ వర్షం కురుస్తుంది. నియోజకవర్గం నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా సీఎం జగన్ తిరువూరు రావడంతో భారీగా ప్లెక్సీలతో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. తిరువూరు టౌన్ మొత్తం హోర్డింగులు, ఫ్లెక్సీలు కట్టారు. అయితే ఈదురుగాలులతో భారీ వర్షం కురవడంతో ఫ్లెక్సీలన్నీ నెలమట్టమైయ్యాయి.