Top Maoist Leader: మావోయిస్టు అగ్రనేత మరొకరు మృతి!
బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కంకర్, రాజనందగాం ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విజయ్ రెడ్డి మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి.
- By Gopichand Published Date - 08:24 PM, Wed - 13 August 25

Top Maoist Leader: ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో (Top Maoist Leader) మరో మావోయిస్టు అగ్రనేత మృతి చెందారు. ఛత్తీస్‌గఢ్ డివిజనల్ కమిటీ (DVC) సభ్యుడు విజయ్ రెడ్డి కంకర్, రాజనందగాం సమీపంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. బుధవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కంకర్, రాజనందగాం ప్రాంతంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో విజయ్ రెడ్డి మృతి చెందినట్లు భద్రతా బలగాలు అధికారికంగా ప్రకటించాయి.
Also Read: Maruti Hybrid Car: మారుతి సుజుకి నుంచి హైబ్రిడ్ మోడల్ కారు.. ధర ఎంతంటే?
విజయ్ రెడ్డి గురించి
విజయ్ రెడ్డి తెలంగాణకు చెందిన మావోయిస్టు అగ్రనేత. ఛత్తీస్‌గఢ్ డివిజనల్ కమిటీలో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అతని మృతి మావోయిస్టులకు పెద్ద దెబ్బ అని బలగాలు పేర్కొన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌తో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్లు మరింత ఊపందుకున్నాయి.