HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Another Success On The Account Of Isro In Three Satellites

ISRO: ఇస్రో ఖాతాలో మరో విజయం.. మూడు ఉపగ్రహాలను నింగిలో

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (Indian Space Research Organization) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

  • By Maheswara Rao Nadella Published Date - 12:10 PM, Fri - 10 February 23
  • daily-hunt
ISRO Satellites
Slv

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈ ఉదయం 9.18 గంటలకు ప్రయోగించిన ఎస్ఎస్ఎల్‌వి-డి2 ప్రయోగం విజయవంతమైంది. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతో షార్‌లోని శాస్త్రవేత్తలు ఆనందంతో కేరింతలు కొట్టారు.

ఎస్ఎస్ఎల్‌వి-డి2 రాకెట్ 334 కిలోల బరువుండే మూడు రాకెట్లతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇందులో రెండు దేశీయ ఉపగ్రహాలు కాగా, అమెరికాకు చెందిన ఓ ఉపగ్రహం ఉంది. వీటిని 450 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. తొలి ఉపగ్రహమైన ఈవోఎస్-07ను 785 సెకన్లకు, రెండోదైన జానుస్-1ను 880 సెకన్లకు, చివరిదైన ఆజాదీశాట్‌ను 900 సెకన్లకు వరుసగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.

వీటిలోని ఈవోఎస్-07 ఉపగ్రహాన్ని ఇస్రో (ISRO) రూపొందించింది. దీని బరువు 156.3 కేజీలు. అలాగే, ఆజాదీశాట్-2 ఉపగ్రహాన్ని చెన్నై స్పేస్‌కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలికలు రూపొందించారు. దీని బరువు 8.7 కేజీలు. ఇక, జానుస్-1ను అమెరికాకు చెందిన అంటారిస్ సంస్థ అభివృద్ధి చేసింది. దీని బరువు 11.5 కేజీలు. కాగా, ప్రయోగ ప్రారంభానికి ముందు ఈ తెల్లవారుజామున 2.48 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 6.30 గంటలపాటు కౌంట్ డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది.

Also Read:  Safest Seat in Airplane: విమానంలో ఏ సీట్లో కూర్చుంటే భద్రత..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • isro
  • satellites
  • success
  • technology
  • Three

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • Weight Loss Tips: 15 రోజుల్లో పొట్ట ఉబ్బరం సమస్యను త‌గ్గించుకోండిలా!

  • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

  • Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయ‌స్ అయ్య‌ర్ డేటింగ్‌.. వీడియో వైర‌ల్‌!

  • India Playing XI: రేపు ఆసీస్‌తో తొలి వ‌న్డే.. భార‌త్ తుది జ‌ట్టు ఇదేనా?

  • India- Russia: చైనాకు చెక్ పెట్టేందుకు సిద్ధ‌మైన భార‌త్‌- ర‌ష్యా?!

Trending News

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd