Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
తెలంగాణలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై ద్వేషపూరిత ఆరోపణలకు పాల్పడుతున్నారు.
- By Praveen Aluthuru Published Date - 02:08 PM, Fri - 17 November 23
Telangana: తెలంగాణలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై ద్వేషపూరిత ఆరోపణలకు పాల్పడుతున్నారు. తాజాగా ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ గోషామహల్ బీజేపీ అభ్యర్థి రాజా సింగ్‌పై కేసు నమోదైంది. ఒక సమావేశంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మంగళ్‌హాట్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. శత్రుత్వాన్ని ప్రోత్సహించడాన్ని నిషేధించే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 125 కింద అతనిపై కేసు నమోదు చేశారు. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని రాజాసింగ్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు సుమోటోగా చర్యలు తీసుకున్నారు. మహారాజ్‌గంజ్‌లోని కమ్యూనిటీ హాల్‌లో జరిగిన పార్టీ సమావేశంలో ఈ ప్రసంగం జరిగిందని చెబుతున్నారు.
Also Read:Oral Health: దంతాల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా.. అయితే ఇబ్బందులు తప్పవు..!