Amaravati: నేటితో అమరావతి ఉద్యమానికి 900 రోజులు
- Author : Anshu
Date : 04-06-2022 - 10:21 IST
Published By : Hashtagu Telugu Desk
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏపీకి మూడు రాజధానులంటూ ప్రకటిచింది. దీంతో అమరావతిలో రాజధాని కోసం భూములిచ్చిన రైతులు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభించారు. ఆ ఉద్యమం నేటికి 900వ రోజుకు చేరింది. 900 రోజుల పాటు రాజధాని రైతులు, మహిళలు, దళిత జేఏసీ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 2019 డిసెంబరు 17న రాజధాని ఉద్యమం మొదలైంది. ఈ ఉద్యమం వివిధ రూపాల్లో సాగింది. ప్రభుత్వ నిర్ణయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నా కోర్టు తీర్పులు వారికి ఎనలేని ఊరటనిచ్చాయి.
రాజధాని ఉద్యమం 900 రోజులకు చేరిన సందర్భంగా అమరావతి రైతులు న్యాయదేవతకు పాలాభిషేకం చేయనున్నారు. రాజధాని ఉద్యమ వీరులకు నివాళులు అర్పించనున్నారు. నేడు విజయవాడలో హైకోర్టు తీర్పు-సర్కారు తీరు పేరిట సదస్సు నిర్వహించనున్నారు. అమరావతిని రాజధానిగా సాధించేంతవరకు పోరాటం ఆపబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు.