Secunderabad Fire: మృతిచెందిన వాళ్లంతా బీహారిలే!
- By Balu J Published Date - 11:28 AM, Wed - 23 March 22
సికింద్రాబాద్ బోయగూడలో బుధవారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం విధితమే. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఒక వ్యక్తి మాత్రం.. కిటికీ పగులగొట్టి ప్రాణాలతో బయట పడ్డాడు. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వాళ్లంతా బీహార్ వాసులేనని పోలీసులు గుర్తించారు.
మృతుల వివరాలు..
- సికందర్
- బిట్టు
- సికిందర్
- గొల్లు
- దామోదర్
- చింటూ
- రాజేష్
- రాజేష్
- దీపక్
- పంకజ్
- దినేష్
హైదరాబాద్‌లోని భోయిగూడలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరం. ఈ దుఃఖ సమయంలో మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. PMNRF నుండి ఒక్కొక్కరికి 2 లక్షలు ఎక్స్ గ్రేషియా మరణించిన వారి కుటుంబాలకు ఇవ్వబడుతుంది: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 23, 2022