HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tragedy During Sankranthi A Massive Fire Breaks Out In Kakinada District

సంక్రాంతి వేళ విషాదం..కాకినాడ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

  • Author : Vamsi Chowdary Korata Date : 13-01-2026 - 10:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kakinada Fire Accident
Kakinada Fire Accident

సంక్రాంతి వేళ కాకినాడ జిల్లా సార్లంక గిరిజన గ్రామంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. గ్రామస్తులంతా పండుగ ఏర్పాట్లలో ఉండగా.. అగ్ని ప్రమాదం సంభవించి.. వారిని రోడ్డున పడేసింది. ఈ ప్రమాదంలో గ్రామంలో 40 పూరిళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సిలిండర్లు పేలడంతో నష్టం మరింత తీవ్రమైంది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ గ్రామస్తులు ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది.

  • పండగ పూట తీవ్ర విషాదం
  • కాకినాడ, సార్లంక గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం
  • 40 ఇళ్లు దగ్ధం.. రోడ్డు పాలైన గ్రామస్తులు

సంక్రాంతి పండుగ వేళ జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఆ గ్రామాన్ని రోడ్డున పడేసింది. ప్రజలంతా పండుగ ఏర్పాట్లలో బిజీగా ఉన్న సమయంలో అనుకోని రీతిలో అంటుకున్న కార్చిచ్చు ఊరు ఊరంతటిని కాలి బూడిద చేసింది. పదుల సంఖ్యలో ఇళ్లను దగ్ధం చేసింది. దీంతో పండుగ పూట కట్టుబట్టలతో ఆ గ్రామ ప్రజలు రోడ్డున పడ్డారు. మంటల్లో కాలి బూడిదైన ఇళ్లను చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, కాకినాడ జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు, మూడు ఇళ్లు మినహా మిగతా పూరిళ్లన్నీ దగ్ధమయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. బాధితులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కాకినాడ జిల్లాలోని రౌతులపూడి మండలంలో సార్లంక అనే గిరిజన గ్రామంలో ఈ భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మారుమూల ప్రాంతంలో ఉన్న సార్లంక గ్రామంలో అధికంగా పూరిళ్లే ఉన్నాయి. సంక్రాంతి పండుగ కావడంతో.. గ్రామంలోని చాలామంది గిరిజనులు బట్టలు, సరుకులు కొనుక్కోవడానికి రౌతులపూడి, తుని వంటి దిగువ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో ప్రమాదం జరిగిన సమయంలో గ్రామంలో చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు.

సాయంత్రం 5 గంటల సమయంలో ఒక పూరి గుడిసెలో మంటలు మొదలయ్యాయి. అవి వేగంగా ఇతర గుడిసెలకు వ్యాపించాయి. గుడిసెల్లో ఉన్న సిలిండర్లు పేలడంతో ప్రమాదం మరింత తీవ్రమైంది. గ్రామంలో ఉన్న కొద్దిమంది ప్రాణభయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. గ్రామంలో దాదాపు అన్ని ఇళ్లు పూరిళ్లే కావడంతో, ఒకదాని తర్వాత ఒకటి అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది. గుడిసెల్లోని సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత పెరిగింది. ఈ ప్రమాదం వల్ల గ్రామంలోని ప్రజలంతా నిరాశ్రయులయ్యారు.

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సార్లంక గ్రామానికి చేరుకున్నారు. అయితే, అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే చాలా నష్టం జరిగింది. 40 పూరిళ్లు పూర్తిగా కాలిపోయాయి. ఇళ్లలోని బట్టలు, సామాన్లు, వంట సరుకులు, ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంతో గ్రామంలోని ప్రజలంతా నిరాశ్రయులయ్యారు. పండుగ పూట గ్రామస్తులంతా రోడ్డు పాలయ్యారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు. అదృష్టం బాగుండి ప్రాణనష్టం జరగలేదు.. కానీ లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • Fire Accident
  • kakinada
  • Tribal Village Sarlanka

Related News

The people are the ultimate arbiters of a historic victory: Deputy CM Pawan.

Pawan Kalyan: ఈ చారిత్రక విజయానికి అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే : డిప్యూటీ సీఎం పవన్

ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని, వారి తీర్పును మించిన శక్తి ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ప్రభుత్వ మార్పునకు మాత్రమే పరిమితం కాలేదని, రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశను నిర్దేశించిందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం కోసం ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున

    Latest News

    • Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్

    • Kesineni Nani : గాదే సాయికృష్ణ మిస్సింగ్ కేసుపై చంద్ర‌బాబుకు లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని

    • TDP vs YSRCP : డీఎస్సీపై లోకేష్ సవాల్‌కు సమాధానం చెప్పే ధైర్యం జగన్‌కు ఉందా..?

    • IMD Rain Alert: తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తున్న నైరుతి రుతుపవనాలు

    • Telegram Banned: టెలిగ్రామ్ యాప్‌పై బ్యాన్‌.. ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు

    Trending News

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd