HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Dsps Yellamma Glimpse Pure Cultural Mysticism

హీరోగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ ఫస్ట్ గ్లింప్స్ విడుదల!

ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే హీరోగా నటిస్తూనే దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక నటుడిగా ఆయన ప్రతిభను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

  • Author : Gopi Date : 15-01-2026 - 5:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Yellamma Glimpse
Yellamma Glimpse

Yellamma Glimpse: ‘బలగం’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు వేణు యెల్దండి తన రెండో ప్రయత్నంగా ‘ఎల్లమ్మ’ అనే గ్రామీణ నేపథ్య కథను ఎంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మొదట్లో రకరకాల వార్తలు వినిపించాయి. ముందుగా నేచురల్ స్టార్ నాని, ఆ తర్వాత నితిన్ ఈ చిత్రంలో నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని తెలియని కారణాల వల్ల వారు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రంతో హీరోగా పరిచయం కాబోతున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.

అధికారిక ప్రకటన

తాజాగా ఈ ఊహాగానాలన్నింటికీ స్వస్తి చెబుతూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘ఎల్లమ్మ’ చిత్రానికి సంబంధించిన ‘ఫస్ట్ గ్లింప్స్’ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ద్వారా దేవిశ్రీ ప్రసాద్‌ను ‘పార్శి’ అనే పాత్రలో పరిచయం చేశారు. ఈ వీడియోలోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ లుక్ చాలా కొత్తగా మునుపెన్నడూ చూడని విధంగా ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్, గెటప్ ఒక రా అండ్ రస్టిక్ ఫీల్‌ను కలిగిస్తున్నాయి.

Also Read: బడ్జెట్ 2026.. ప్ర‌ధాన మార్పులివే?!

సాంకేతిక వర్గం- నిర్మాణం

ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే హీరోగా నటిస్తూనే దేవిశ్రీ ప్రసాద్ స్వయంగా సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఒక నటుడిగా ఆయన ప్రతిభను వెండితెరపై చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ రైట్స్‌ను ప్రముఖ సంస్థ టి-సిరీస్ (T-Series) దక్కించుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cultural Mysticism
  • devi sri prasad
  • dil raju
  • tollywood
  • Yellamma Glimpse
  • Yellamma Update

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

    Latest News

    • Diabetes: షుగర్ పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. వారానికి ఒకేఒక్క డోస్‌తో డయాబెటిస్ కు చెక్

    • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

    • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

    • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

    • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd