Aghori: కర్నూలులో అఘోరీ ప్రత్యక్షం.. ఎందుకో తెలుసా?
పాదయాత్రగా యాగంటికి బయలుదేరి వస్తున్న అఘోరి కర్నూలుకి చేరుకున్నాక అనేకమంది ఆమెను ఫాలో అవుతూ వచ్చారు.
- By Gopichand Published Date - 06:40 PM, Fri - 8 November 24

Aghori: తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన అఘోరీ (Aghori) మరోసారి కర్నూల్‌లో హల్ చల్ సృష్టించారు. కర్నూలులో మహిళా అఘోరీ ప్రత్యక్షమైంది. తెలంగాణకు చెందిన అఘోరీ ఇటీవల తెలుగు ఉభయ రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి మనకు తెలిసిందే. గత వారం రోజులుగా అఘోరీ మాత తెలుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. కర్నూలులో ప్రత్యక్షం కావడంతో అభిమానులు గుమిగూడారు. హైదరాబాద్ నుండి యాగంటి పుణ్య క్షేత్రానికి అఘోరీ తాజాగా కారులో బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో కారు మొరాయించడంతో కారును అలంపూర్ వద్ద వదిలేసి కాలినడకన యాగంటికి బయలుదేరారు.
పాదయాత్రగా యాగంటికి బయలుదేరి వస్తున్న అఘోరి కర్నూలుకి చేరుకున్నాక అనేకమంది ఆమెను ఫాలో అవుతూ వచ్చారు. అఘోరీ దర్శించుకునేందుకు జనం ఎగబడ్డారు. రోడ్డు మార్గాన అఘోరీ కాలినడకన వస్తుండటంతో వాహనాలు ఎక్కడిక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో అఘోరీ ప్రత్యక్షం కావడంతో బళ్లారి చౌరస్తా నుంచి గుత్తి పెట్రోల్ బంకు మీదుగా అఘోరీని భక్తులు దర్శించుకున్నారు.
Also Read: Vijay Deverakonda: మెట్లపై నుంచి జారిపడ్డ విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్!
కర్నూలు శివారు వరకు ఆమెను ఫాలో అవుతూ మొక్కుతూ దర్శించుకునేందుకు బారులు తీరారు. అయితే అఘోరీ యాగంటి దర్శనానికి వెళ్తున్నట్లు చెప్పడం జరిగింది. అంతకుమించి మీడియా వాళ్ళతో ఏం మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. రెండు రోజుల క్రితం కాళహస్తిలో ఇదే అఘోరీ ఆత్మార్పణకు ప్రయత్నించి కలకలం రేపింది. అయితే అక్కడి పోలీసులు అఘోరీని నిలవరించి వస్త్రాలు ఒంటికి కప్పి సముదాయించిన విషయం తెలిసిందే. ఇటీవల అన్నవరం, కాళహస్తి దర్శనం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే యాగంటి దర్శనానంతరం మళ్లీ అఘోరీ ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ ప్రత్యక్షం అవుతుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.