Accident News: కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీ.. 25 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం
కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ సమీపంలో మంగళవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదం (Accident) లో 25 మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
- Author : Gopichand
Date : 30-05-2023 - 11:26 IST
Published By : Hashtagu Telugu Desk
Accident News: కేరళలోని త్రిసూర్ జిల్లా ఇరింజలకుడ సమీపంలో మంగళవారం ఉదయం రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న ప్రమాదం (Accident) లో 25 మందికి పైగా గాయపడగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బస్టాప్‌లో ఒక వాహనాన్ని ఆపివేయగా.. మరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న పలువురు గాయపడ్డారని, ఈ ఘటనకు సంబంధించి తమకు ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
Also Read: 10 Dead: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 12 మందికి గాయాలు
ప్రమాదానికి కారణం అజాగ్రత్త డ్రైవింగ్ లేదా అతివేగమా అనే విషయం ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. 25 మందికి పైగా గాయపడిన వారిలో ఇద్దరిని చికిత్స నిమిత్తం త్రిసూర్ కు తరలించినట్లు ఇరింజలకుడ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.