10 Dead: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. 10 మంది మృతి, 12 మందికి గాయాలు
అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడి 10 మంది మృతి (10 Dead) చెందారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు.
- Author : Gopichand
Date : 30-05-2023 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
10 Dead: అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడి 10 మంది మృతి (10 Dead) చెందారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ ఆస్పత్రికి తరలించారు. మృతులను ఇంకా గుర్తించలేదు. జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అమృత్‌సర్ నుంచి కత్రా వెళ్తున్న బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు.
Also Read: Jupalli Krishnarao: మాజీ మంత్రి జూపల్లి అరెస్ట్.. నాగర్ కర్నూల్ లో ఉద్రిక్తత
#WATCH जम्मू: अमृतसर से कटरा जा रही एक बस झज्जर कोटली की गहरी खाई में गिरने से 10 लोगों की मौत हो गई। घायलों को अस्पताल पहुंचाया गया। अधिक जानकारी की प्रतीक्षा है। pic.twitter.com/2QxLlwHg6V
— ANI_HindiNews (@AHindinews) May 30, 2023
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు జమ్మూ డీసీ వెల్లడించారు. ఎంతమంది గాయపడ్డారనేది ఇంకా తెలియరాలేదు. సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం ప్రకారం.. జమ్మూ జిల్లాలోని ఝజ్జర్ కోట్లి ప్రాంతంలో బస్సు వంతెనపై నుండి పడిపోయింది. ఈ ప్రదేశం జమ్మూ నుండి 35 కి.మీ, కత్రా నుండి 15 కి.మీ.ల దూరంలో ఉంది.
ఓ అధికారి సమాచారం ప్రకారం.. జమ్మూలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణికులతో నిండిన బస్సు అమృత్‌సర్ నుంచి కత్రాకు వెళ్తుండగా అదుపు తప్పి కాలువలో పడిన ఘటన ఝజ్జర్ కోట్లి ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం అక్కడికక్కడే ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులందరినీ ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అదే సమయంలో ఈ సంఘటనలో ఇప్పటివరకు 10 మంది మరణించినట్లు నిర్ధారించబడింది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది అన్నారు.