Telangana Assembly : ఫిబ్రవరి 7న శాసనసభ ప్రత్యేక సమావేశం..!
ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
- By Latha Suma Published Date - 08:26 PM, Thu - 30 January 25
Telangana Assembly : తెలంగాణ కేబినెట్ ఫిబ్రవరి 5వ తేదీన భేటీ అవ్వనుంది. ఈ కేబినెట్ సమావేశంలో రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. భేటీలో కుల గణన సర్వే రిపోర్టుపై చర్చించి ఆమోద ముద్రం వేయనుంది. అలాగే ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి కులగణన నివేదికపై సభలో చర్చించి అనంతరం అసెంబ్లీ ఆమోద ముద్ర వేయనుంది. బీసీ రిజ్వేషన్ల పెంచాలని కోరుతూ కేంద్రానికి అప్పీలు చేయాలని శాసనసభలో నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా కుల గణన సర్వే నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసర్వేను ఇప్పటికే పూర్తిగా అధికారులు ఫైనల్ నివేదకను రెడీ చేశారు. ఈ తుది నివేదికను అధికారులు ఫిబ్రవరి 2వ తారీఖున కేబినెట్ సబ్ కమిటీకి సమర్పించనున్నారు. కులగణ సర్వే నివేదకపై మంత్రి వర్గ సబ్ కమిటీ చర్చించి తుది నివేదకను ఆమోదం కోసం కేబినేట్‌కు సమర్పించనుంది. అంతేకాక.. ఈ కేబినెట్ భేటీలోనే పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపైన కేబినెట్ చర్చించనున్నట్లు తెలుస్తోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోద ముద్ర వేసి.. అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
ఇక, గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న రాజ్ భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహణపై చర్చించినట్లు తెలిసింది. గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 7న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Read Also: Best Opening Pairs: ఐపీఎల్ లో బెస్ట్ ఓపెనింగ్ జోడీలు