IPS Officers : రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సీఐడీ ఐజీగా ఎం శ్రీనివాసులు, రామగుండం సీపీగా అంబర్ కిశోర్ ఝా, వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్, ఇంటెలిజెన్స్ ఎస్పీగా సింధూశర్మ, మహిళా భద్రత విభాగం ఎస్పీగా చేతన, నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేశ్.
- Author : Latha Suma
Date : 07-03-2025 - 4:36 IST
Published By : Hashtagu Telugu Desk
IPS Officers : తెలంగాణలో 21 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల్లో అడిషనల్ డీజీతో పాటు ఇద్దరు ఐజీపీలు, ఇద్దరు డీఐజీలు, ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలు ఉన్నారు. మిగిలిన 14 మంది ఎస్పీలకు స్థాన చలనం కలిగింది.