HMPV: భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి .. తాజాగా 10 నెలల చిన్నారికి వైరస్!
చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుంచి మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది.
- By Gopichand Published Date - 02:40 PM, Sat - 11 January 25

HMPV: దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ (HMPV) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల సత్వరం, నిరంతర సలహాల జారీ కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపడం లేదు. ఇప్పుడు అసోంలో వైరస్ ఇన్ఫెక్షన్ కేసు కనుగొనబడింది. 10 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకింది. హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ (HMPV) వైరస్ కేసులు భారతదేశంలో 15కి పెరిగాయి. వీటిలో అత్యధికంగా 4 కేసులు గుజరాత్‌కు చెందినవే. మరోవైపు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 10 నెలల చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.
అసోంలో తొలి కేసు నమోదైంది
అసోంలోని లఖింపూర్‌లో 10 నెలల చిన్నారికి HMPV వైరస్ సోకింది. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన సూచనలలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న రోగులను పర్యవేక్షించాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ జారీ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. శ్వాసకోస వ్యాధుల బాధితుల కోసం కొన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ప్రత్యేక వార్డులను ఓపెన్ చేశాయి.
Also Read: Champions Trophy 2025: గత ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్, విరాట్ ప్రదర్శన ఎలా ఉందంటే?
కోవిడ్ తర్వాత చైనాలో HMPV వైరస్ విధ్వంసం
చైనాలో హ్యూమన్ మెటాప్‌న్యూమోవైరస్ (HMPV) కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. కోవిడ్ తర్వాత ఇప్పుడు చైనా నుంచి మరో వైరస్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. కరోనా దుష్ప్రభావాల నేపథ్యంలో ప్రపంచం అలెర్ట్‌గా ఉంది. మరోవైపు సిక్కిం రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. సిక్కిం దాదాపు 200 కి.మీ చైనాతో సరిహద్దును పంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.