HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Special
  • >Telugu Movies Releasing For Sankranti 2024

Makar Sankranti: హింసలేని సినిమాలకు తావు లేదా?

అసలే సంక్రాంతి పండగ. పండగ అంటే బంధువులు, పిండి వంటలు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులు, బసవన్నలు, హరిదాసుల సంకీర్తనలు ఇవి మాత్రమే కాదు. పండగ సమయానికి విడుదలయ్యే సినిమాల హడావిడి కూడా ఎక్కువే

  • Author : Praveen Aluthuru Date : 14-01-2024 - 8:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Makar Sankranti
Makar Sankranti

డా.ప్రసాదమూర్తి

Makar Sankranti: అసలే సంక్రాంతి పండగ. పండగ అంటే బంధువులు, పిండి వంటలు, భోగి మంటలు, రంగురంగుల రంగవల్లులు, బసవన్నలు, హరిదాసుల సంకీర్తనలు ఇవి మాత్రమే కాదు. పండగ సమయానికి విడుదలయ్యే సినిమాల హడావిడి కూడా ఎక్కువే. పండుగ సందర్భంగా ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల గురించి కాదు గాని ఈ మధ్యకాలంలో నేను చూసిన కొన్ని భారీ బడ్జెట్ సినిమాల గురించి చెప్పాలనిపించింది. ఎంత రక్తపాతం ఉంటే అంత గొప్ప సినిమా అని, ఎంత హింస ఉంటే అంత ఉన్నతమైన సినిమా అని, ఎంత భయానకంగా ఉంటే అంత ఆధునికమైన సినిమా అని ఇప్పుడు కొత్తగా అర్థాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురించింది.

సినిమాలో చూపించే హింసాత్మక ఘటనలు, రక్తపాతాలు కలెక్షన్లు వర్షం కురిపిస్తాయని ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, యాక్టర్లు విశ్వసించే కాలం వచ్చింది. ఎంత ఎక్కువ బడ్జెట్ పెడితే అంత భారీగా హింస చూపించవచ్చు. ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడితే అంత భయంకరంగా హింసోన్మాదాన్ని వెండితెర మీద ప్రదర్శించవచ్చు. ఇది ఇప్పటి భారీ బడ్జెట్ సినిమాల బహిరంగ రహస్యం. కనీసం కొన్ని వందల వాహనాలైనా మంటల్లో మాడి దగ్ధమైపోవాలి. కనీసం కొన్ని వందల మంది అయినా విచ్ఛిన్నమైన దేహాలతో నెత్తురోడుతూ కనిపించాలి. ఒకే ఒక్క వీరుడు ఎన్ని వందల మందినైనా ఒంటి చేత్తో చీల్చి చెండాడి, రక్తాన్ని ఏరులై ప్రవహింపజేసి అత్యంత క్రూరంగా నవ్వాలి. ఎంత క్రూరంగా.. ఎంత హింసోన్మాదంగా.. ఎంత భయంకరంగా నటిస్తే ఆ నటుడు అంత గొప్ప హీరో.

ఇటీవల నేను చూసిన రెండు సినిమాల గురించి చెప్తాను. యానిమల్ సినిమా అందరూ చూసే ఉంటారు. రణబీర్ కపూర్ హీరో. సందీప్ రెడ్డి వంగా డైరెక్టర్. సినిమా చూస్తున్నంత సేపు నెత్తురు కురుస్తూ ఉంటుంది. మనుషుల శరీరాలు, అవయవాలు అవయవాలుగా గాల్లో రబ్బరు బంతుల్లా ఎగురుతూ ఉంటాయి. భీకరమైన సౌండ్ పొల్యూషన్ మన చెవుల్లో నుంచి నరాల్లో నుంచి మన ఆత్మల్లోకి ప్రవహించి మనల్ని హతాశుల్ని చేస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎడతెరిపి లేకుండా సాగుతున్న నరమేధానికి కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది. ఆ భయంకర శబ్దానికి చెవులు మూసుకోవాల్సి వస్తుంది. మరి కళ్ళూ చెవులూ మూసుకుంటే ఆ సినిమా ఎలా గొప్పదవుతుంది? అది డైరెక్టరే చెప్పాలి.

సినిమా చూస్తున్నంత సేపు యానిమల్ ఎవరు? హీరోనా.. డైరెక్టరా అర్థం కాక మనం తన్నుకు చావాలి. డైరెక్టర్ ను యానిమల్ తో పోల్చి సరిపెట్టుకుందాం అంటే ఆ పోలికకు యానిమల్స్ కూడా కోపగించుకుంటాయని అనుమానం. కేవలం తన తండ్రిని చంపాలని చూసే వారిని హతమార్చడం హీరో టార్గెట్. అలా మనుషుల్ని నరుక్కుంటూ వెళ్లిపోతుంటాడు. మనం భయంతో వణికిపోతుంటాం. కానీ విచిత్రంగా ఈ సినిమాకు రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. వేల కోట్లు నిర్మాతకు ఆదాయం తెచ్చిపెట్టింది. సినిమా అంటే ఎంత హింస చూపిస్తే అంత కలెక్షన్స్. ఇదే కాదు ఇటీవల వచ్చిన మరొక భారీ బడ్జెట్ సూపర్ హీరో సినిమా సలార్. ఇందులో కూడా చంపడం నరకడం రక్తాన్ని ఏరుల్లా ప్రవహింపజేయడం, ఒకే ఒక కథానాయకుడు వందల మందిని ఊచ కోత కోయడం.. ఇదే కథాంశం. సినిమా అంటే ఒక ఉదాత్తమైన కథ, సమాజానికి గొప్ప సందేశాన్ని ఇచ్చే కథనం, నటుల అద్భుత నటనా వైదుష్యం, గొప్ప చిత్రీకరణ, వినూత్నమైన దృశ్యీకరణ.. ఇలాంటివి ఎన్నో కలిసి రూపొందుతుంది. కానీ సినిమా అంటే కథ కాదని, సినిమా అంటే సమాజానికి ఇచ్చే సందేశం కాదని, సినిమా అంటే రెండు గంటల వికృత వినోదం అని రాను రాను మనవాళ్లు కొత్త కొత్త అర్థాలు చెబుతున్నారు. చూడాలి, ఈ పండుగ సందర్భంగా విడుదలైన సినిమాలలోనైనా నెత్తురు బదులు అత్తరు కురుస్తుందని ఆశిద్దాం.

Also Read: Sankranti Special: ఆశల దీపాలు సంక్రాంతి ముగ్గులు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • animal
  • Makar Sankranti
  • movies
  • tollywood
  • Tradation
  • Volence

Related News

Sankranti

మకర సంక్రాంతి ఎప్పుడు! పండితులు ఏం చెబుతున్నారంటే?

జ్యోతిషశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. భూమి తన అక్షం మీద స్వల్పంగా వంగుతూ తిరగడం వల్ల, ప్రతి 70 నుండి 75 ఏళ్లకు ఒకసారి మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది.

  • Bhartha Mahasayulaki Wignyapthi Movie Review

    మాస్ మహారాజా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రివ్యూ

  • The Raja Saab 3 Day Worldwide Box Office Collections

    ప్రభాస్ ది రాజా సాబ్ మూడు రోజుల కలెక్షన్స్

  • Godavari Districts kodi pandalu

    కోడి పందేలకు ముస్తాబవుతున్న గోదావరి జిల్లాలు

  • bandla ganesh maha padayatra

    ఏపీ సీఎం చంద్రబాబు కోసం బండ్ల గణేష్ మహా పాదయాత్ర

Latest News

  • కొన్ని చిట్కాలతో ఇంట్లోనే స్వచ్ఛమైన పన్నీర్ చేసుకోవచ్చు..

  • భోగభాగ్యాల భోగి పండుగ శుభాకాంక్షలు.. మీ స్నేహితులకు, బంధువులకు ఇలా స్పెషల్ కోట్స్, విషెస్‌తో చెప్పేయండి!

  • క్రికెట‌ర్ సూర్య‌కుమార్‌పై ఖుషీ ముఖర్జీ ఆరోప‌ణ‌లు.. రూ. 100 కోట్ల పరువు నష్టం దావా!

  • కేంద్ర ప్రభుత్వం మ‌రో కీలక నిర్ణయం!

  • పిల్ల‌ల‌ని ఈ స‌మ‌యాల్లో అస్స‌లు తిట్ట‌కూడ‌ద‌ట‌!

Trending News

    • ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్‌కు ఎఫైర్ ఉందా?!

    • ఐపీఎల్ 2026కు ముందు భార‌త క్రికెట‌ర్‌ రిటైర్మెంట్!

    • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

    • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

    • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd